జాతీయ వార్తలు

జల పంపిణీ విధానం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కావేరీ జలాల పంపిణీ విషయంలో దీర్ఘకాలంగా అమలవుతున్న అశాస్ర్తియ, కాలంచెల్లిన విధానాలకు స్వస్తిచెప్పాలని సుప్రీం కోర్టు నియమించిన సాంకేతిక కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ తాజా సూచన ద్వారా తమిళనాడు, కర్నాటకల మధ్య తలెత్తిన జల వివాదానానికి ఓ పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం చేసింది. కావేరీ పరివాహక ప్రాంతంలో నీటి లభ్యతకు సంబంధించిన వాస్తవ వివరాలతో తమకు నివేదిక ఇవ్వాలని ఈ నెల 4న సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కమిటీని నియమించింది. అక్కడ పరిస్థితిని అధ్యయనం చేసిన కమిటీ రెండు రాష్ట్రాలు కూడా తీవ్రస్థాయిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని సోమవారం నాడు అందించిన 40 పేజీల నివేదికలో స్పష్టం చేసింది. కావేరీ పరివాహక ప్రాంతలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన సాంకేతిక కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా నీటి లభ్యతపై కమిటీ అధ్యయనం చేసింది. వరుసగా మూడేళ్లుగా నీటి లభ్యత తక్కువగానే ఉందని, ఈ ఏడాది అదే కొనసాగిందని స్పష్టం చేసింది. రైతులకు నీటిని అందించే వౌలిక సదుపాయాలు అత్యంత ప్రాచీనమైనవని, వీటివల్ల చాలావరకూ నీరు వృధా అవుతోందని కమిటీ తెలిపింది. జల వనరులను గరిష్టస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే పంపిణీ వ్యవస్థను ఆధునీకరించుకోవాలని చెప్పింది. అలాగే ఇరు రాష్ట్రాల్లోనూ రైతులు తీవ్రస్థాయిలో అవస్థలు పడుతున్నారని, ఇలాంటి వారికి తగిన రీతిలో పంట నష్టపరిహారం అందించాలని సూచించింది. కేంద్ర జల కమిషన్ చైర్మన్ జిఎస్ ఝా సారథ్యంలోని తొమ్మిది మంది సభ్యులున్న కమిటీలో కర్నాటక, తమిళనాడు, పుదుచ్ఛేరి, కేరళ ప్రభుత్వాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.
కాగా ఈ అంశంపై తదుపరి విచారణ మంగళవారం జరుగుతోంది.