జాతీయ వార్తలు

యుపి కాంగ్రెస్‌కు మరో దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పునాదులు కదిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, శాసన సభ్యురాలు రీటా బహుగుణ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు రావటంతో రాష్ట్ర కాంగ్రెస్ గందరగోళంలో పడింది. అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ఎంపిక చేసినందుకు నిరసనగా రీటా బహుగుణ కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు తాము ఎన్నో ఏళ్లనుండి కష్టపడుతుంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటివారిని ఎలా ప్రకటిస్తారని రీటా బహుగుణ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. పార్టీకోసం కష్టపడిన వారిని పక్కనపెట్టి బయటివారికి ప్రాధాన్యత ఇస్తునప్పుడు తామెందుకు పార్టీలో ఉండాలన్నది వారి ప్రశ్న. రీటా బహుగుణ బిజెపి కేంద్ర నాయకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రీటా బహుగుణ సోదరుడు, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఇదివరకే తొమ్మిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో బిజెపిలో చేరటం తెలిసిందే. విజయ్ బహుగుణ దారిలో ఇప్పుడు రీటా బహుగుణ కూడా బిజెపిలో చేరుతారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నత వర్గాల మద్దతు సంపాదించేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న బిజెపి రీటా బహుగుణను చేర్చుకోవటం ద్వారా రాష్ట్రంలోని బలమైన బ్రాహ్మణ వర్గం మద్దతును కూడగట్టుకోవాలని ఆలోచిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 18 శాతం జనాభా ఉన్న బ్రాహ్మణ వర్గం బిజెపికి మద్దతుగా నిలిచినా ఇటీవలి కాలంలో ఈ వర్గానికి చెందిన కొందరు మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పికి చేరువయ్యారు. బిఎస్‌పికి బాసటగా నిలిచిన ఈ బ్రాహ్మణ వర్గాన్ని తమవైపు ఆకర్షించేందుకే బిజెపి అధినాయకత్వం రీటా బహుగుణను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అతి సీనియర్ నాయకుడు హెమవతీ నందన్ బహుగుణ కుమార్తె అయిన రీటా బాహుగుణ చేరితే బిజెపికి రాజకీయంగా కలిసిరావటంతోపాటు కాంగ్రెస్‌కు బాగా దెబ్బ తగులుతుందని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల బిఎస్‌పి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి బ్రిజేష్ పాఠక్‌ను పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే.