జాతీయ వార్తలు

సైన్యం చెప్పిందంటే వినాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 17: పాక్ అక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలని డిమాండ్ చేయటంపై రక్షణమంత్రి మనోహర్ పారికర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ సైన్యం నిరంతరం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, భారత సైన్యం దీటుగా వాటికి జవాబిస్తోందని ఆయన అన్నారు. ‘‘గత అయిదారేళ్లుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. మీరు లెక్కలు చూడవచ్చు. ఇప్పుడు పరిస్థితిలో వచ్చిన మార్పేమిటంటే మన సైన్యం గట్టిగా జవాబిస్తోంది.’’ అని పారికర్ స్పష్టం చేశారు. మనం కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఒకవేళ అందులో లోపాలేమైనా ఉంటే వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. జాతీయ భద్రత విషయంలో భారతీయుల్లో సున్నితత్వం మరింత పెరిగిందన్నారు. లక్షిత దాడుల విషయంలో దేశ రాజకీయ నాయకుల తీరును ఆయన గర్హించారు. ‘‘లక్షిత దాడులు జరిగిన నాటి నుంచీ మన రాజకీయ నాయకులు వాటికి రుజువులు అడుగుతూనే ఉన్నారు. సైన్యం మనకు ఒక మాట చెప్పిందంటే మనం విశ్వసించాల్సిందే. మన సైన్యం ప్రపంచంలోనే గొప్పది. సాహసోపేతమైంది. శక్తిమంతమైంది. దేశం పట్ల అత్యున్నత అంకితభావం కలిగింది. ఇక్కడ ఉన్న వాళ్లెవరూ వారి నుంచి రుజువులు కోరతారనుకోను’’ అని పారికర్ వ్యాఖ్యానించారు. కొందరు రాజకీయ నాయకులు మినహా ప్రతి ఒక్క భారతీయుడూ మన వీర జవానులకు దన్నుగా నిలిచారన్నారు. స్థానిక నిర్మా యూనివర్శిటీలో నిర్వహించిన ‘‘నో మై ఆర్మీ’’ అన్న కార్యక్రమంలో పారికార్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో బి ఎస్ ఎఫ్ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది. మనం కంచె వేయలేని ప్రాంతాల్లో టెక్నాలజీని ఉపయోగించి ఏ ఒక్కరూ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నామని పారికర్ వివరించారు.