జాతీయ వార్తలు

తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: వచ్చే జనవరి 3 నుంచి 7వ తేదీవరకు తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ఏర్పాట్లుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రణాళిక, వసతి, భద్రతాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి సైన్స్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ నారాయణ ,రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ అధికారులు, చిత్తురు జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు. సమావేశం తరువాత సుజనా చౌదరి మాట్లాడుతూ సదస్సుకు 9 మందికిపైగా నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత శాస్తవ్రేత్తలు హాజరవుతారని వెల్లడించారు. దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే ఏపీలోని 13 జిల్లాల విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సైన్స్ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది ప్రతినిదులు హాజరుకానున్నారని తెలిపారు.

మన్నవరం పనులు మొదలుపెట్టండి కేంద్రానికి సిపిఐ వినతి

న్యూఢిల్లీ, అక్టోబరు 17: రాష్ట్రంలో మన్నవరం ప్రాజెక్టు మాయమైపోతుందన్న భయం ప్రజలకు ఉందని సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరుతూ సీపీఐ జాతీయ నేతలు డి రాజాతో కలిసి కేంద్రమంత్రి పియూష్ గోయల్‌కు నారాయణ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో శంకుస్థాపనకు నోచుకున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని కేంద్రమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నందున ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని కేంద్రమంత్రి వెల్లడించారని, త్వరలోనే దీనీపై నిర్ణయం తీసుకోని కేంద్ర నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చినట్టు నారాయణ తెలిపారు. కేంద్ర ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రాకపోగా ఉన్న ప్రాజెక్టు కూడా మూతపడి పోతున్నాయని నారాయణ మండిపడ్డారు.