జాతీయ వార్తలు

22మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, అక్టోబర్ 17: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 22మంది దుర్మరణం చెందారు. మరో 12మంది తీవ్రంగా ఒళ్లుకాలిన గాయాలతో సమీపంలోని ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రఖ్యాత ‘సమ్’ఆసుపత్రి మొదటి అంతస్తులోని డయాలిసిస్ విభాగంలో సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, క్షణాల్లోనే ఐసియూ విభాగానికీ వ్యాపించాయని ఆరోగ్య కార్యదర్శి ఆరతి అహూజా తెలిపారు. క్షణాల్లో చాలా మందిని సమీపంలోని కాపిటల్ ఆసుపత్రికి తరలించినా..అప్పటికే వారు మరణించారని..అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. మొత్తం 37మందికి తాము చికిత్స చేస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భువనేశ్వర్‌లోని అమ్రీ అనే మరో ఆసుపత్రి విభాగం అధినేత సలీల్ మహంతి తెలిపారు. మంటలు వ్యాపించిన ఐసియూ విభాగంలోనే ఎక్కువ మంది మరణించారని వెల్లడించారు. మంటల్లో మొత్తం 500మంది రోగులు చిక్కుకు పోవడంతో వారిని వెలుపలికి తెచ్చేందుకు హుటాహుటిన అగ్ని మాపక, పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఏడు అగ్ని మాపక దళాలను, పనె్నండుకు పైగా అంబులెన్స్‌లను సహాయ చర్యల కోసం వినియోగించారు. క్షణాల్లో రోగులను సమీపంలోని అపోలో,కళింగ,ఎస్‌సిబి, అమ్రీ తదితర ఆసుపత్రులకు తరలించారు. అద్దాలు పగుల గొట్టి మరీ ఐసియూ, డయాలిసిస్ విభాగాల్లోకి వెళ్లి కొందరు రోగుల్ని రక్షించగలిగారు. ఈ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సమ్ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయక్ తెలిపారు. ఈ ఘోర అగ్ని ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చిత్రం... మొదటి అంతస్తు నుంచి క్షతగాత్రులను రక్షిస్తున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు