అంతర్జాతీయం

అఫ్గాన్ భవితకు ఉగ్రవాదమే పెనుముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, డిసెంబర్ 25: అఫ్గానిస్తాన్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న ధోరణిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. సరిహద్దుల ఆవల నుంచి అఫ్గానిస్తాన్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ఆపివేసినప్పుడే, ఉగ్రవాద నర్సరీలను, అభయారణ్యాలను మూసివేసినప్పుడే అఫ్గానిస్తాన్ విజయవంతం అవుతుందని, పురోగమిస్తుందని పేర్కొంటూ పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే ఆ దేశంపై మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మరో దేశంతో పోటీ పడటానికి కాకుండా అఫ్గానిస్తాన్ అభివృద్ధికి, పురోగమనానికి దోహదపడాలనే దృఢ సంకల్పంతోనే ఆ దేశానికి భారత్ సాయం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద మంటలను ముట్టించేందుకు, ఎగదోసేందుకు కాకుండా అఫ్గానిస్తాన్ భవిష్యత్తుకు పునాదులు వేయడానికే ఈ దేశంలో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆయన తెగేసి చెప్పారు. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారత్ 90 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన అధునాతనమైన, విశాలమైన భవనాన్ని మోదీ శుక్రవారం ప్రారంభించారు. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి పేరిట అఫ్గానిస్తాన్ పార్లమెంటు ఆవరణలో నిర్మించిన ‘అటల్ బ్లాక్’ను కూడా మోదీ ప్రారంభించారు. అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం అఫ్గానిస్తాన్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ యుద్ధ పీడిత దేశమైన అఫ్గానిస్తాన్ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉగ్రవాదం, హింస పనిముట్లు కాజాలవని, అవి అఫ్గాన్ ప్రజల ఇష్టాయిష్టాలను నియంత్రించజాలవని అన్నా రు. సుమారు 40 నిముషాల పాటు సాగిన మోదీ ప్రసంగం అఫ్గానిస్తాన్ పార్లమెంటు సభ్యులను అమితంగా ఆకట్టుకుంది. మధ్య మధ్యలో పలుసార్లు కార్యక్రమానికి హాజరయిన పార్లమెంటు సభ్యులు, ఇతరులు మోదీ ప్రసంగం పట్ల గట్టిగా హర్షధ్వానాలు చేస్తూ తమ ఆనందాన్ని, మద్దతును వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లో భారత్ జోక్యం పట్ల పాకిస్తాన్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘మేము ఇక్కడ ఉండటం కొందరికి ఇష్టంలేదు. మేము ఇక్కడ ఉండటం వల్ల ఏదో చెడు జరుగుతోందన్న, ప్రమాదం ముంచుకొస్తోందన్న తప్పుడు భాష్యాలను తీస్తున్నవారు కొందరున్నారు. మన భాగస్వామ్యం బలపడటం పట్ల వ్యాకులతతో ఉన్నవారు మరికొందరు ఉన్నారు’ అని మోదీ అన్నారు.