జాతీయ వార్తలు

గంట ప్రయాణం.. రూ.2500 చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ పథకం కింద చిన్న పట్టణాలను అనుసంధానించే గంట లోపు విమాన ప్రయాణానికి రూ 2,500 మాత్రమే చార్జి చేస్తారు. విమానంలోని సగం సీట్లను ఈ కేటగిరీ కింద కేటాయిస్తారు. మిగతా సీట్లకు మార్కెట్ ధరల ప్రకారమే చార్జీలుంటాయి. ఈ పథకం కింద తొలి విమానం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ విమాన టికెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ఈ పథకానికి నిధుల సమీకరణ కోసం రద్దీ రూట్లలో ప్రతి డిపార్చర్‌పైన చిన్న మొత్తంలో సుంకం విధించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఎంత మొత్తంలో సుంకం విధించాలనేది వచ్చే నెల నిర్ణయించనున్నారు. అయితే ఈ సుంకం విధించడం వల్ల టికెట్ల ధరలు పెరుగుతాయని విమానయాన సంస్థలు అంటున్నాయి. సామాన్య ప్రయాణికుడి భరించే స్తోమత, రీజినల్ ఆపరేటర్ లాభాలు చేకూరడం అనే రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించామని, ఈ పథకం విజయవంతమవుతుందని తాము భావిస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఈ పథకం కింద తొలి విమానం 2017 జనవరిలో టేకాఫ్ అవుతుందని కూడా ఆయన చెప్పారు. ఇప్పటివరకు విమాన సర్వీసులు లేని, సామర్థ్యానికి తక్కువగా సర్వీసులున్న విమానాశ్రయాలకు విమానాల కనెక్టివిటీని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌ను మూడేళ్ల పాటు గ్రామీణ రూట్లలో సర్వీసులు నడిపేందుకు అనుమతిస్తామని, రీజినల్ ఆపరేట్లుగా ఔత్సాహికులకు విమానాల లీజ్‌లో ప్రాధాన్యత ఇస్తామని ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. 476-500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే విమానాల్లో సగం సీట్లను టికెట్ల ధరను రూ. 2,500గా నిర్ణయిస్తారు. హెలికాప్టర్ల విషయంలో అరగంట ప్రయాణానికి రూ 2,500లు, గంట ప్రయాణానికి రూ. 5వేలు చార్జి ఉంటుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30 దాకా విమానాశ్రయాలను సిద్ధం చేస్తారు. ఈ పథకం కింద విమానాల ఫ్రీక్వెన్సీ వారానికి కనిష్టంగా 3, గరిష్ఠంగా 7 ఉంటాయి.