జాతీయ వార్తలు

సత్తా చాటిన బిఎస్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, అక్టోబర్ 21: ఎలాంటి కవ్వింపులేకుండా కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్ రేంజర్లకు భారత దళాలు తమ సత్తా చూపాయి. శుక్రవారం ఉదయం ఆధీన రేఖ ప్రాంతంలోని బోబియాన్ పోస్టుపై పాక్ సరిహద్దు దళాలుగా పేర్కొనే రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు ప్రతిగా ఎదురుకాల్పులు జరిపిన భారత దళాలు ఎడుగురు పాక్ రేంజర్లును మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఓ పాక్ మిలిటెంట్ కూడా మరణించాడని, మరో ఐదుగురు పాక్ రేంజర్లు కూడా గాయపడ్డారని సైనిక వర్గాలు తెలిపాయి. బోబియాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో పాకిస్తాన్ రేంజర్ల నుంచి ఆకస్మికంగా కాల్పులు మొదలయ్యాయని, తప్పని సరి పరిస్థితుల్లో బిఎస్‌ఎఫ్ దళాలు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి జరిపి అనేక మంది ఉగ్రవాదులను భారత దళాలు హతమార్చిన తర్వాత నుంచీ అదే పనిగా పాక్ దళాలు కవ్వింపు కాల్పులకు పాల్పడుతూనే ఉన్నాయని, శుక్రవారం జరిగింది 32వ ఉల్లంఘన అని బిఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా రజౌరీ, కతువా జిల్లాలను ఆనుకుని ఉన్న సరిహద్దుల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపారు. భారత జవాను గాయపడటంతో బిఎస్‌ఎఫ్ దళాలు ప్రతిగా తీవ్ర స్థాయిలో కాల్పులకు ఒడిగట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఏడుగురు పాక్ రేంజర్లు మరణించిన విషయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా ధృవీకరించిందని తెలిపారు. పాక్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ గుర్నామ్ సింగ్ అనే జవాను పరిస్థితి విషమంగా ఉందని, అతడ్ని జమ్ములోని వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించామని బిఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు. గత రాత్రి జరిగిన మిలిటెంట్ల చొరబాటు ప్రయత్నాన్ని తిప్పికొట్టడంలో గుర్నామ్ సింగ్ ఎంతో సాహసాన్ని ప్రదర్శించాడని గుర్తు చేశారు. కటువాతో పాటు సాంబా,పరగ్‌వాల్ సెక్టార్లలో కూడా పాక్ రేంజర్లు ఎలాంటి కవ్వింపు లేకుండానే కాల్పులకు ఒడిగట్టారని, అక్కడ కూడా బిఎస్‌ఎఫ్ దళాలు గట్టిగానే బుద్ధి చెప్పాయని వెల్లడించారు. ఇదే ప్రాంతం నుంచి భారత్‌లోకి చొరబడేందుకు గురువారం పాక్ మిలింటెంట్లు జరిపిన ప్రయత్నాన్ని బిఎస్‌ఎఫ్ దళాలు వమ్ము చేశాయని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు.