జాతీయ వార్తలు

కోర్టా? చేపల మార్కెట్టా? నోర్ముయ్యండి.. లేదంటే గెంటేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సుప్రీం కోర్టులో శుక్రవారం కొన్ని అవాంఛనీయ ఘటనలు తలెత్తాయి. సర్వోన్నత న్యాయస్థానంలో ఆందోళనకు దిగిన కొంత మంది న్యాయవాదులు పరస్పరం ఒకరి నొకరు నిందించుకుంటూ వాదులాటకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ వారిని గట్టిగా దండించారు. ‘ఎందుకు అరుస్తున్నారు?.. ఇదేమన్నా న్యాయస్థానమా? లేక చేపల మార్కెట్టా?.. నోరు ముయ్యండి.. న్యాయస్థానంలో ఎవరైనా హుందాగా వ్యవహరించి తీరాలి.. లేదంటే బయటికి గెంటేస్తా.. న్యాయస్థానంలో నిగ్రహంతో వ్యవహరించలేని వారు సీనియర్ న్యాయవాదులు కావాలనుకోవడం సిగ్గుచేటు’ అంటూ కోర్టు గదిలో వాదులాటకు దిగిన న్యాయమూర్తులపై చీఫ్ జస్టిస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరిగా ప్రర్తించకపోతే బయటికి పంపేస్తానని కొంత మంది న్యాయవాదులను ఆయన హెచ్చరించడంతో పాటు మళ్లీ ఇటువంటి పని చేయవద్దని బిగ్గరగా అరుస్తున్న ఒక లాయర్‌ను మందలించారు. ‘న్యాయస్థానానికి గౌరవ మర్యాదలు ఉన్నాయి. కోర్టులో గట్టిగా అరవడం వలన ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఇదేమన్నా న్యాయస్థానమా? చేపల మార్కెట్టా?, ఈ వ్యవహారంతో మీకు సంబంధమేంటి? సోలీ సొరాబ్జీ (ప్రముఖ సీనియర్ న్యాయవాది)ని చూడండి. న్యాయస్థానంలో ఎలా వ్యవహరించాలో ఆయనను చూసి నేర్చుకోండి’ అంటూ ప్రధాన న్యాయమూర్తి వారికి హితబోధ చేశారు.