జాతీయ వార్తలు

తక్షణమే న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కావేరీ జలాలను కర్నాటక అందించకపోవడం వల్ల తమిళనాడు అధ్వాన్న స్థితికి దిగజారిందని ప్రతిపక్ష నేతలు శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి మొరపెట్టుకున్నారు. ఒకప్పుడు అన్నం పెట్టిన తమ రాష్ట్రం ఇప్పుడు పంటలు లేక నష్టపోయి భిక్షపాత్రగా మారిందని స్పష్టం చేశారు. తమ రాష్ట్ర పంటల దుస్థితిని అర్థం చేసుకొని తగిన రీతిలో జోక్యం చేసుకోవడం ద్వారా న్యాయం చేయాలని అభ్యర్థించారు. కావేరీ జలాల పంపిణీలో ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు కావేరీ యాజమాన్య బోర్డును తక్షణం ఏర్పాటుచేయాలని, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ఎంపి డి. రాజా నేతృత్వంలో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ నాయకులు శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు. కావేరీ జలాలను విడుదల చేయడంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కర్నాటక లెక్కచేయడం లేదన్న అంశాన్ని కూడా వీరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపి రాజా విలేఖరులతో మాట్లాడుతూ కావేరీ జలాలు కేవలం ఒక్క రాష్రానికి చెందినవి కావనీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు సమాన హక్కులున్నాయని తెలిపారు. కావేరీ యాజమాన్య బోర్డును తక్షణం ఏర్పాటుచేసేలా చొరవ తీసుకోవాలని రాష్టప్రతి ప్రణబ్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఎండిఎంకె నాయకుడు వైకో మాట్లాడుతూ పదిమందికీ అన్నం పెట్టే తమిళనాడు ప్రస్తుతం బిక్షపాత్ర పట్టుకునే పరిస్థితికి చేరిందన్నారు. సకాలంలో కర్నాటక కావేరీ జలాలు విడుదల చేయకపోవడం వల్ల ఈ ఏడాది ఎనిమిదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్టప్రతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎండిఎంకె నేత వైకో

ఎలాంటి నిధుల కొరత లేదు
కేంద్ర మంత్రి ఉమాభారతి

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: పోలవరం ప్రాజెక్టు నిధుల విషయమై ఎలాంటి ఆందోళనలూ అవసరం లేదని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. శుక్రవారం పిఎంకెఎస్‌వై పథకానికి నాబార్డ్ తొలివిడత రుణాల విడుదల సందర్భంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు సకాలంలో అందకపోవచ్చన్న భయాలు రాష్ట్రానికి ఉన్నాయన్న ఓ విలేఖరి ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. పోలవరం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ జరుగుతోందన్నారు. ప్రాజెక్టుపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేస్తూ, పోలవరం భారత జాతికే గర్వకారణమని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుపై ఒడిశా వ్యక్తం చేసిన అభ్యంతరాలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ కృషి చేస్తోందన్నారు. ఆంధ్రతోపాటు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్టల్రకు పోలవరంలో భాగస్వామ్యం ఉందన్నారు. ఉమాభారతి మరో ప్రశ్నకు బదులిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించటం లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం గడువులోగా పూర్తి చేయగలమన్న ఆశాభావాన్ని మంత్రి ఉమాభారతి వ్యక్తం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులకు నాబార్డ్ రుణం
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద చేపడుతున్న 99 ప్రాజెక్టుల జాబితాలో మొదటి ప్రాధాన్యతలో ఉన్న 23 ప్రాజెక్టులకు నాబార్డ్ ద్వారా మొదటి విడత సహాయం కింద 1500 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణలోని జె.చొక్కారావు ఎత్తిపోతల పథకానికి దీనినుండి 11.07 కోట్లు లభించనున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో నాబార్డ్ మొదటి విడత రుణం వివరాలను వెల్లడించారు.
పిఎంకెఎస్‌వై కింద దేశంలోని ఎంపిక చేసిన 99 నీటిపారుదల ప్రాజెక్టులను 2019 డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్థారించటం తెలిసిందే. నిధుల కొరత మూలంగా నత్తనడకన నడుస్తున్న ఈ ప్రాజెక్టులకు కేంద్ర నిధులతోపాటు నాబార్డ్ నుండి రుణాలు ఇప్పించాలని నిర్ణయించారు. పిఎంకెఎస్‌వై కింద చేపట్టిన 99 ప్రాజెక్టులలోని ఇరవై మూడు ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా నిర్థారించారు. ఈ 23 ప్రాజెక్టులను 2017లోగా పూర్తిచేస్తారు, రెండో ప్రాధాన్యతలో ఉన్న 31 ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2018లోగా పూర్తిచేస్తారు.
మిగతా 45 ప్రాజెక్టులను 2019-20లోగా పూర్తిచేస్తారు. మొదటి ప్రాధాన్యత కింద 2017లోగా పూర్తి చేయవలసి ఉన్న 23 ప్రాజెక్టుల్లో తెలంగాణకు చెందిన జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం మాత్రమే ఉన్నది. ఏపికి చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది నీటిపారుదల ప్రాజెక్టులు, తెలంగాణలోని తొమ్మిది ప్రాజెక్టులు రెండవ ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. తెలంగాణలోని ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టు మూడో ప్రాధాన్యతా ప్రాజెక్టుల జాబితాలో ఉన్నది.