అంతర్జాతీయం

తప్పు నంబరు కాల్ చేసిన బ్రిటీష్ వ్యోమగామి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 25: రోదసీ పరిశోధనలకోసం వెళ్లిన తొలి బ్రిటీష్ వ్యోమగామి మేజర్ టిమ్ పీక్ శుక్రవారం రోదసీలోంచి భూమిపైకి ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పొరబాటున తప్పుడు నంబర్‌కు కాల్ చేసారు. అయితే ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న ఆయన ఆ సంఘటన కావాలని చేసింది కాదని తప్పుడు నంబరు మాత్రమేనని తన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. ‘ హలో ఇది భూగోళమేనా? అంటూ నేను పొరబాటున కాల్ చేసిన మహిళకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అది కావాలని చేసిన కాల్ కాదు, పొరబాటు నంబర్ మాత్రమే’ అని అంతర్జాతీయ రోదసీ కేంద్రం (ఐఎస్‌ఎస్)నుంచి పీక్ ట్వీట్ చేసారు. ఐఎస్‌ఎస్‌లో ఆరు నెలల పాటు శాస్ర్తియ ప్రయోగాలు జరుపుతూ గడపనున్న పీక్ శుక్రవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం భూమికి చేసిన కాల్స్ ఏవీ కలవలేదు. అయితే అంతకుముందు ఆయన తన తల్లితండ్రులకు చేసిన కాల్ మాత్రం కలవడమే కాకుండా వారు తిరిగి సమాధానం కూడా ఇచ్చారు. చెడిపోయిన ఒక పరికరాన్ని సరిచేయడం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు టిమ్ కోప్రా, స్కాట్ కెల్లీలు ఐఎస్‌ఎస్ వెలుపల స్పేస్ వాక్ చేయడానికి పీక్ ఇటీవల సహకరించారు. ఆర్మీలో ఇంతకు ముందు మేజర్‌గా పని చేసిన 43 ఏళ్ల పీక్ ఐఎస్‌ఎస్‌లో పని చేస్తున్న మిగతా సిబ్బందితో చేరడం కోసం వెళ్లిన తొలి బ్రిటన్. యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ఆయనను ఐఎస్‌ఎస్‌కు పంపించింది. ఇంతకు ముందు రోదసీలోకి వెళ్లిన ఇతర బ్రిటీష్ పౌరులంతా కూడా వ్యక్తిగతంగా వెళ్లిన వారో లేదా అమెరికా పౌరసత్వం తీసుకుని వెళ్లిన వారో కావడం గమనార్హం. ఈనెల ప్రారంభంలో పీక్ కజకిస్థాన్‌లోని బైకనూర్ రాకెట్ ప్రయోగ కేంద్రంనుంచి ఐఎస్‌ఎస్‌కు బయలుదేరి వెళ్లినప్పుడు భార్య, ఆరు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఆయనకు వీడ్కోలు చెప్పారు.