జాతీయ వార్తలు

ఏం మాట్లాడారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 26: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాది పార్టీలో నెలకొన్న సంక్షోభం బుధవారం ఆసక్తికర మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు విధేయుడుగా భావిస్తున్న మరో మంత్రిని పార్టీ నుంచి బహిష్కరించడంతో ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అఖిలేష్ రాష్ట్ర గవర్నర్ రాంనాయక్‌ను కలుసుకోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందేనని రాజ్‌భవన్ వర్గాలు అభివర్ణించినప్పటికీ ప్రస్తుత రాజకీయ సంక్షోభం దృష్ట్యా దీనికి భిన్న కోణాలను ఆపాదిస్తున్నారు. దాదాపు పావుగంటపాటు గవర్నర్ రాంనాయక్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి అఖిలేష్ తాజా పరిణామాలపై ఆయనకు సవివరంగా తెలియజేసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీపావళి రోజున గవర్నర్ రాష్ట్రంలో ఉండటం లేదు కాబట్టి ముందుగానే ఆయనను అఖిలేష్ కలుసుకుని శుభాకాంక్షలు చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా మూడో వ్యక్తి ఎవరూ లేకుండా రాంనాయక్, అఖిలేష్ మధ్య ముఖాముఖీ జరగడంతో ఏమి జరిగివుంటుందన్న దానిపై ప్రత్యర్థి వర్గాల్లో అయోమయం నెలకొంది. గవర్నర్‌తో సమావేశానికి సంబంధించి ముందస్తుగానే అనుమతి కోరిన అఖిలేష్ ఉన్నపళంగా పార్టీ సీనియర్ నేతలు, శాసనసభ్యుల సమావేశం నుంచి నిష్క్రమించి హుటాహుటిన రాజ్‌భవన్‌కు తరలివెళ్లారు. తాజా పరిణామాలపై వివరణ ఇవ్వాలని గవర్నర్ ఆదేశించడంతోనే అఖిలేష్ ఆయనను అత్యవసరంగా కలుసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. అధికార పార్టీలోనే చీలిక ఏర్పడటంతో ప్రభుత్వ భవితవ్యం గురించే కాకుండా, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి కూడా గవర్నర్ అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీలో అఖిలేష్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనే విషయాన్ని కూడా గవర్నర్ నిర్ధారించుకున్నారని, ఇందులో భాగంగానే మద్దతుదారుల జాబితాను కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటిదేమీ జరగలేదని అఖిలేష్ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడైన శివపాల్ యాదవ్ అనూహ్య రీతిలో అఖిలేష్ సన్నిహితుడైన తేజ్ నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే పాండేపై చర్య తీసుకున్నానని అఖిలేష్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అంతేకాదు ఆయనను మంత్రి మండలి నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. మీడియాలో తనకు వ్యతిరేకంగా కథనాలు సృష్టిస్తున్నారని, ఎమ్మెల్సీ ఆషు మాలిక్‌పై అఖిలేష్ నేరుగానే విరుచుకుపడటం, దాన్ని ఆసరా చేసుకుని ఆ ఎమ్మెల్సీపై పాండే చేయి చేసుకోవడంతో ఈ బహిష్కరణ వేటు పడింది.
chitram...
బుధవారం యుపి గవర్నర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి అఖిలేష్