జాతీయ వార్తలు

న్యాయ వ్యవస్థకు తాళాలు వేయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28:హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించాలంటూ కొలీజియం సిఫార్సు చేసి దీర్ఘకాలమైనా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిప్పులు చెరిగింది. న్యాయ వ్యవస్థకు తాళాలు వేయాలనే ప్రభుత్వం భావిస్తోందా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘కొర్టు గదులకు తాళాలు పడ్డాయి. న్యాయ వ్యవస్థనే మూసేయాలని భావిస్తున్నారా..’అని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచి కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తన ఉదాసీన ధోరణితో మొత్తం వ్యవస్థను చతికిల పడేలా చేయజాలదని కూడా అదే తీవ్రతతో వ్యాఖ్యానించింది. నియామక విధానం (ఎమ్‌ఓపి) ఖరారు కాకపోయిన కారణంగా న్యాయమూర్తుల నియాకమ ప్రక్రియను నిలిపివేయడం ఎంత మాత్రం సమంజసం కాదని తెలిపింది. న్యాయమూర్తుల నియామక ఫైళ్ల పరిశీలన కూడా నత్తనడక చందంగానే ఉందని విమర్శించింది. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పిఎంఓ, న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శుల్ని పిలిపించాల్సి వస్తుందని కూడా సుప్రీం కోర్టు బెంచి కేంద్రాన్ని హెచ్చరించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ఎంత మాత్రం స్తంభించి పోవడానికి వీల్లేదని ఉద్ఘాటించిన న్యాయమూర్తులు ‘నియామక విధానం ఖరారు కాకపోయినా ఈ ప్రక్రియను కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది’అని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థలో నియామక ప్రక్రియకు ఎమ్‌ఓపి ఖరారుకు ఎలాంటి సంబంధం లేదని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్,ఎల్.నాగేశ్వరరావులతో కూడిన సుప్రీం బెంచి స్పష్టం చేసింది. వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం జరుగక పోవడం వల్ల..తీవ్ర స్థాయిలో కొరత ఏర్పడిందని..దీని కారణంగానే కర్నాటక హైకోర్టులోని కొన్ని గదులకు తాళాలూ పడ్డాయని గుర్తు చేసింది. ఈ వ్యవహారం వ్యక్తిగతమైనది కాదని, ఓ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి సంబంధించినదని ఉద్ఘాటించింది. అలాగే వ్యవస్థల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని తాము కోరుకోవడం లేదని, ఇది ఎవరి అహానికి సంబంధించినది కాదని కూడా న్యాయమూర్తులు తెలిపారు. అన్ని వ్యవస్థల మధ్య సామరస్యపూర్వక వాతావరణం కొనసాగాలని, ఏ వ్యవస్థా దెబ్బతినే పరిస్థితి తలెత్త కూడదని హితవు పలికారు. దేశంలోని హైకోర్టులు కేవలం 40శాతం సిబ్బందితోనే పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. కాగా, ఎమ్‌ఓపి ఖరారు కాకపోవడం కూడా ప్రధానమైన అంశాల్లో ఒకటని పేర్కొన్న అటార్నీ జనరల్ రోహద్గీ సమీప భవిష్యత్‌లోనే న్యాయమూర్తుల నియామకాల్లో పురోగతి సాధిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిపై తదుపరి విచారణను వచ్చే నెల 11కు కోర్టు వాయిదా వేసింది.