జాతీయ వార్తలు

అంతర్ రాష్ట్ర మండలి పునర్వ్యవస్థీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: అంతర్ రాష్ట్ర మండలి (ఇంటర్ స్టేట్ కౌన్సిల్), అంతర్‌రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పునర్‌వ్యవస్థీకరించారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పనిచేసే అంతర్ రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభ్యుడుగా నియమితులయ్యారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన పనిచేసే అంతర్ రాష్ట్ర మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సభ్యులుగా వ్యవహరించటం తెలిసిందే. వీరితోపాటు ఆరుగురు కేంద్ర మంత్రులు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర సమాచార, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర మంత్రివర్గంలో సహాయ, ఇండిపెండెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆహార, పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఒరామ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి తన్వర్ చంద్ గెహ్లాట్, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్, పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంతర్‌రాష్ట్ర మండలి సభ్యులుగా నియమితులయ్యారు.
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్ రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీతోపాటు ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజె సింధియా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ సభ్యులుగా వ్యవహరిస్తారు.