జాతీయ వార్తలు

బంగ్లాదేశ్‌లో ఆలయాల ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 31: బంగ్లాదేశ్‌లో 15 హిందూ ఆలయాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇస్లాం మతాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో చేసిన కథనాలే ఆలయాలపై దాడులకు కారణమైంది. నసీర్‌నగర్ జిల్లాలోని బ్రహ్మణ బార్హియా ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులకు చెందిన వంద ఇళ్లను లూఠీ చేశారు. ఆదివారం ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. దుండగులు రెచ్చిపోయి హబీగంజ్, మధాబ్‌పూర్ పక్కనే ఉన్న మరోరెండు ఆలయాలపై దాడులు చేశారు. ఆలయాలపై దాడులకు సంబంధించి ఆరుగుర్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హిందూ దాడుల నేపథ్యంలో పార్లమెంటరీ బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (బిజిబి) బలగాలను నసీర్‌నగర్, మధాబ్‌పూర్ జిల్లాలో మోహరించారు. రాపిడ్ యాక్షన్ బెటాలియన్, పోలీసులు, ఆర్మ్‌డ్ పోలీసు బెటాలియన్లను రంగంలోకి దింపినట్టు బిడిన్యూస్24.కాం వెల్లడించింది. డిప్యూటీ కమిషనర్ రెజ్వనూర్ రెహ్మాన్, ఎస్‌పి మిజనౌర్ రెహ్మాన్‌లు సంఘటనా స్థలాలను సందర్శించారు. హరిన్‌బెర్హా గ్రామానికి చెందిన రస్‌రాజ్ దాస్ అనే వ్యక్తి ఫేస్‌బుల్‌లో చేసిన వ్యాఖ్యలు నసీర్‌నగర్ దాడులకు కారణమయ్యాయని స్థానికులు తెలిపారు. దైవదూషణ ఆరోపణల కింద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.

హర్యానాతో
తెలంగాణ ఒప్పందం

న్యూఢిల్లీ, అక్టోబరు 31: ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ, హర్యానా రాష్ట్రాల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మహేశ్ శర్మ సమక్షంలో హర్యానా అదనపు కార్యదర్శ ధీరా ఖండెల్వాతో సాంస్కృతిక, పర్యాటక రంగాలలో అవగాహనా ఒప్పందాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం కుదుర్చుకొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ రానున్న నాలుగేండ్లలో జమ్మూకశ్మీర్, పంజాబ్, హిమచల్‌ప్రదేశ్, ఉత్తరఖండ్‌లతోనూ ఒప్పందం ఉంటుందన్నారు.