జాతీయ వార్తలు

వక్రబుద్ధి, పిచ్చిపని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కాశ్మీర్‌లో సంఘ వ్యతిరేక శక్తులు మన శత్రువుల ప్రోద్బలం మేరకే రాష్ట్రంలోని పాఠశాలలను తగులబెడుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్‌తాదివస్ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాలలకు నిప్పుపెట్టటం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. వక్రబుద్ధి, పిచ్చి పట్టినవారు మాత్రమే పాఠశాలలకు నిప్పుపెట్టగలుగుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దులకు ఆవలినుండి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవారి ప్రోద్భలం మేరకే పాఠశాలలకు నిప్పుపెట్టే దుష్ట కార్యక్రమం కొనసాగుతోందని, ఈ దుశ్చర్యల వెనక ఉన్న దురుద్దేశాలను కాశ్మీర్ ప్రజలు అర్థం చేసుకోవాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇది అత్యంత తీవ్రమైన, హేయమైన చర్య, ఈ చర్యలకు పాల్పడుతున్న వారిని దూరంగా పెట్టాలని ఆయన కాశ్మీర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రానికి చెందిన పిల్లలకు విద్యాభ్యాసం లేకుండా చూసేందుకు జరుగుతున్న కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పాఠశాలలకు నిప్పు పెట్టిస్తున్న వేర్పాటువాదులు మాత్రం తమ పిల్లలకు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేయించుకుంటున్నారని విమర్శించారు. తన సిబ్బంది చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించిన వెంకయ్య దేశ మొదటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వజ్ర సంకల్పుడని, ఐక్యమత్యాన్ని నిలబెట్టిన ఘనుడని ప్రశంసించారు. పటేల్ మరికొంత కాలం జీవించి ఉన్నా, ప్రధాన మంత్రి పదవి చేపట్టినా దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.
స్వాతంత్య్రంకోసం ఎంతో పోరాటం చేసిన పటేల్‌కు సరైన గుర్తింపు రాలేదన్నారు. పటేల్ ధైర్య సాహసాల మూలంగానే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందన్నారు.