జాతీయ వార్తలు
ఏ చట్టమూ సమర్థించజాలదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియమించే పద్ధతి ఏ చట్టం ప్రకారం కూడా సమర్థనీయం కాదని భారత ప్రభుత్వం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియమించటానికి ప్రాతిపదికగా ఉన్న కొలీజియం వ్యవస్థ చట్టబద్ధతను ప్రభుత్వం ప్రశ్నించింది. ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వర్గం మాట చెల్లుబాటయ్యే విధంగా రూపొందించిన ఎన్‌జెఏసి చట్టాన్ని గత నెల 16న సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి, రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌జెఏసి చట్టాన్ని కొట్టివేసిన తరువాత ప్రభుత్వం కొలీజియం వ్యవస్థపై పార్లమెంటులో ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం తప్పనిసరి అని పేర్కొంటూనే, ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం సంప్రదింపుల ప్రక్రియ ద్వారా జరిగి తీరాలని గతంలో న్యాయవాదిగా పనిచేసిన జైట్లీ అన్నారు. ‘రాజ్యాంగం పట్ల నిబద్ధత’ అనే అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చను ఆయన ప్రారంభిస్తూ ‘డాక్టర్ అంబేద్కర్ ఊహించిన దానికి పూర్తి భిన్నమైన పరిణామాలు ఈరోజు చోటు చేసుకుంటున్నాయి’ అని అన్నారు. ‘ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియమించే పద్ధతికి చేరుకున్నాము. మిగతా ఎవరు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకున్నా అసంగతమనే పరిస్థితిలో ఉన్నాము. ఈ వాదనను ఏ చట్టమూ సమర్థించజాలదు’ అని జైట్లీ పేర్కొన్నారు.