జాతీయ వార్తలు

ఇందిరకు జాతి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 32వ వర్ధంతి సందర్భంగా జాతియావత్తు నివాళులర్పించింది. సఫ్దర్‌జంగ్‌లోని ఇందిర స్మారకచిహ్నం వద్ద రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుష్పగుచ్చాలుంచి శ్రద్దాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ట్విట్టర్‌లో నివాళులర్పించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో నెం.24 అక్బర్ రోడ్ నుండి ఇందిరా గాంధీ హత్యకు గురైన నెం.1 సఫ్దర్‌జంగ్ రోడ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నివాళి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విలేఖరులకు తెలిపారు. రాహుల్ నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కుమారి షెల్జా, అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. అయితే అనేక బాతులు చనిపోయి బర్డ్ఫ్లూ ప్రబలే అవకాశం ఉన్నందున శక్తిస్థల్ వద్ద నిర్వహించాలనుకున్న కార్యక్రమాన్ని కాంగ్రెస్ వర్గాలు రద్దుచేసుకున్నాయి. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన సిక్కు అంగరక్షకుల కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే.
chitram...
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం సఫ్దర్‌జంగ్‌లోని స్మారకచిహ్నం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న రాష్టప్రతి ప్రణబ్. పాదయాత్రగా తరలివస్తున్న ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సుశీల్ కుమార్ షిండే తదితరులు