జాతీయ వార్తలు

నల్లధనంపై యుద్ధం ( పెద్ద నోట్ల చలామణీకి మంగళం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్ల చలామణీకి మంగళం

పెద్ద నోట్ల రద్దు.. దేశ హితానికి కొత్త పొద్దు
ఉగ్రవాదం, అవినీతికి ఇక చరమగీతం
దేశ చరిత్రలో ఇదో చారిత్రక పరిణామం
అందరి సహకారంతోనే భారత్‌కు అగ్రస్థానం
ఇదో మహాయజ్ఞం.. ప్రజా మద్దతుతోనే విజయం
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

అవినీతి, నల్లధనం, ఉగ్రవాదంపై
ఇది మహాయుద్ధం..ఓ మహా యజ్ఞం..ఇబ్బంది తప్పదు.
ప్రజలు సహకరించాలి.

దేశ ప్రజలకే మా ప్రభుత్వం అంకితం. పౌరుల సహకారంతోనే భారత్ అంతర్జాతీయంగా తలమానికంగా ఎదిగింది.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దేశంలోని నల్లధనాన్ని అదుపు చేసేందుకు ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించారు. నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి పనె్నండు గంటల నుండి ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల చెలామణి ఆగిపోతుందని మోదీ ప్రకటించారు. నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయటంతోపాటు ఉగ్రవాదుల కార్యకలాపాలకు తోడ్పడుతోందని, ఇది దేశానికి ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. దీన్ని అదుపు చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ వద్ద ఉన్న ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను డిసెంబర్ 30 తేదీలోగా రానున్న యాభై రోజుల్లో బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చునని సూచించారు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు పోను మిగతా నోట్లు, నాణాలు అన్నీ చలామణి అవుతాయని నరేంద్ర మోదీ తెలిపారు. పదకొండో తేదీ రాత్రి పదకొండు గంటల వరకు ఆసుపత్రులు, పెట్రోలు బంకుల్లో ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు చెలామణి అవుతాయన్నారు. స్మశానాల్లో కూడా ఇవి పదకొండో తేదీ రాత్రి వరకు చెలామణి అవుతాయన్నారు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల చలామణి నిలిపివేస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూసేందుకు నరేంద్ర మోదీ పలు రకాల మార్గాలు ప్రకటించారు. నవంబర్ తొమ్మిది, పది తేదీల్లో ఏటిఎంలు పని చేయవని ఆయన వెల్లడించారు. చెక్కులు, డిడిలు, క్రెడిట్, డెబిట్ కార్డులు పని చేస్తాయని మోదీ ప్రకటించారు. ప్రజలు ఎల్లుండి నుండి ఏటిఎంల నుండి రోజుకు పది వేలు , వారానికి ఇరవై వేల రూపాయలు మాత్రమే తీసుకునేందుకు మొదట అనుమతిస్తామని, క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుతామని మోదీ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు బ్యాంకులు, పోస్టు ఆఫీసులు రేపు పని చేయవని ఆయన ప్రకటించారు. నల్లధనం, దొంగ నోట్లు, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తాను ప్రారంభించిన యుద్ధంలో దేశ ప్రజలు తనకు సహకరించాలని, కొన్ని ఇబ్బందులు ఎదురైనా సహించాలని అభ్యర్థించారు. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మీడియా, స్వచ్చంద సంస్థలు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కొత్త ఐదు వందల నోట్లు, రెండు వేల రూపాయల నోట్లను జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశ చరిత్రలో కొన్ని ముఖ్యమైన క్షణాలు వస్తాయని, ఈరోజు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఇలాంటిదేనన్నారు. నల్లధనం, దొంగ నోట్లు, ఉగ్రవాదులతో జరుపుతున్న పోరాటంతో ప్రజలు తమతో సహకరించాలన్నారు. నిజాయితీపరులైన దేశ ప్రజలు తన నిర్ణయంతో ఏకీభవించగలరన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసినట్లే దేశాన్ని పరిశుభ్రం చేసేందుకు నల్లధనంపై పోరాటం చేపట్టామన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థ, విభాగం, శాఖ, సంస్థలో అవినీతి చోటుచేసుకుందని, దీన్ని సమూలంగా నిర్మూలించాల్సి ఉంటుందన్నారు. భారత్ అత్యంత వేగంతో ముందుకు సాగుతున్న ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్న మోదీ అవినీతిలో కూడా అందరి కంటే ముందున్నామని తెలిపారు. అవినీతి, నల్లధనం అనే రోగాలు దేశం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయన్నారు. నల్లధనం ఉగ్రవాదులను పోషిస్తోందని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యల మూలంగా ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పారు. నల్ల ధనాన్ని అదుపు చేసేందుకు అత్యంత గట్టి చర్యలు తీసుకోవలసిన అవసరం ఏర్పడినందుకే ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చామని మోదీ తమ ప్రసంగంలో తెలిపారు. నిజాయితీపరులైన పౌరులకు కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అయితే దేశ ప్రయోజనాల కోసం ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతి, నల్లధనం, దొంగనోట్లు, ఉగ్రవాదంపై తాము ప్రారంభించిన మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, దీనిని విజయం చేయాలని దేశ ప్రజలకు మోదీ పిలుపు ఇచ్చారు.