జాతీయ వార్తలు

జీవన హక్కు హరించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం విచారణకు చేపట్టనుంది. కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల కోటాది మందికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇది పౌరుల జీవన, వాణిజ్య హక్కును హరించడమేనని పిటిషనర్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన వీటిని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, జస్టీస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచి విచారిస్తుంది. కేంద్రం నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రెండు పిటిషన్లను ఢిల్లీకి చెందిన లాయర్లు, మరో రెండు పౌరులు దాఖలు చేశారు. సహేతుకమైన గడువు లేకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను మంగళవారం విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించినందున ఉత్కంఠ నెలకొంది. కోటానుకోట్ల మంది బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారని, తగిన నగదు లేకపోవడం వల్ల వీరి దైనందిన జీవితమే దుర్బరమైపోతోందని పిటిషనర్లు తెలిపారు. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయాన్ని రద్దు చేయడమో లేదా వాయిదా వేయడమో చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్లను విచారించడానికి లేదా వాటిపై ఉత్తర్వులను జారీ చేయడానికి ముందు తమ వాదన వినాలంటూ కేంద్రం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది.