జాతీయ వార్తలు

వచ్చేవారమే కరవు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం నివేదిక పరిశీలించి జనవరి తొలివారంలో కరవు సాయం అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. కేంద్రంలోని ఐదు మంత్రిత్వ శాఖల అధికారులు కరవు నివేదికలను అధ్యయనం చేస్తున్నారని అన్నారు. అయితే, ఆంధ్రకు అందించే ఆర్థిక సాయం విషయం తరువాత తెలియజేస్తానన్నారు. ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం కరవు సాయానికి సంబంధించిన విధి విధానాలను సక్రమంగా పాటించకపోవటం వల్లే కేంద్రం కరవు సాయం అందించడంతో ఆలస్యం జరుగుతోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కరవుప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం సాయం అందజేయటంలేదంటూ తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ జనవరి మొదటి వారంలో తెలంగాణకు కరవు సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. దత్తాత్రేయ బుధవారం రాధామోహన్ సింగ్‌తో కలిసి విలేఖరుల సమావేశంరో మాట్లాడారు. రాష్ట్రంలో కరవువల్ల 2,500 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక పంపించిన తెలంగాణ ప్రభుత్వం, ఆ తరువాత పంపించిన మరో నివేదికలో నష్టాన్ని మూడు వేల కోట్లుగా చూపించిందని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించందని, ఆ నివేదిక అందగానే కేంద్ర బృందాలు అక్కడ పర్యటించి అధ్యయనం చేశాయన్నారు. కేంద్ర బృందం అధికారులు తమ నివేదికకు తుది రూపం ఇచ్చి రెండు మూడు రోజుల్లో హోంశాఖకు పంపిస్తారని దత్తాత్రేయ చెప్పారు. ఈ విషయంపై తాను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడినట్టు తెలిపారు. కేంద్ర బృందం నివేదిక అందగానే తెలంగాణకు అత్యధిక సహాయం చేస్తామని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారని బండారు వివరించారు. కర్నాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్టక్రు ఇచ్చిన సహాయం కంటే ఎక్కువ చేస్తామని హోం శాఖ మంత్రి హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. ‘సహాయ నిబంధనలను కూడా సవరించాం. పంట నష్ట పరిహారాన్ని 33 శాతం నుంచి 50 శాతానికి పెంచినందున ఎక్కువ సహాయం లభిస్తుందని రాజ్‌నాథ్ నాతో చెప్పారు’ అని బండారు పేర్కొన్నారు. కాగా తెలంగాణలో హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి జనవరి 7న శంకు స్థాపన జరుగుతుందని బండారు వెల్లడించారు. భారత పత్తి కార్పొరేషన్ పత్తి రైతులకు క్వింటాలుకు 4, 500 నుంచి ఐదు వేల రూపాయలు చెల్లించి సేకరిస్తోందని ఆయన వివరించారు.