ఆంధ్రప్రదేశ్‌

జీతాలు.. పెన్షన్లు ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: ‘ఒకటో తేదీ వస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వాలి. పింఛన్లు చెల్లించాలి.. ఇందుకు అవసరమైన కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చేలా తక్షణమే చర్యలు చేపట్టండి’ అంటూ బ్యాంకర్లను సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో 70 శాతం పైగా డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారు. 25 శాతం సబ్సిడీపై ఇ-పాస్ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బ్యాంకర్లు, అధికారులతో సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు, సామాజిక పింఛన్లు అందించాల్సిన బాధ్యత ఉందని, వాటికి అవసరమైన నగదు మొత్తాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా తక్షణమే చర్యలు చేపట్టాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఇకపై సామాన్యులు డిజిటల్ లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, ఉపాధి సూపర్‌వైజర్లు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులను అన్ని గ్రామాలకు పంపాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి, సిబ్బంది, ఇతర మానవ వనరులను మోహరించి డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రానున్న 10 రోజలు కీలకమని, ఒత్తిళ్లు పెరగవచ్చని దానికి తగినట్లుగా అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లను, అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు అంతా ఆన్‌లైన్ లావాదేవీలు జరపాలన్నారు. ఈ వ్యాలెట్లలో నగదు పరిమితిని కేంద్రం పెంచిందని, యుఎస్‌ఎస్‌డి చార్జీలను 50 పైసలకు తగ్గించిందన్నారు. రాష్ట్రంలో పంటలు చేతికి వచ్చే సమయమని, అందుకు అనుగుణంగా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలన్నారు. మీ సేవా కేంద్రాల్లోనూ నగదు రహిత లావాదేవీలను మరింత పెంచాలన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో అక్కడి వాస్తవ పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో బుధవారం 2730 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నట్లు సిఎంకు ఆర్‌బిఐ అధికారులు వివరించారు. వీటిలో 2200కోట్ల రూపాయల మేరకు 2000 నోట్లు, మిగిలినవి చిన్ననోట్లని తెలిపారు. విజయవాడలో 500 రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు.
చిత్రం... బ్యాంకర్లతో బుధవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు