జాతీయ వార్తలు

సత్వరమే మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని బుధవారం సమీక్షించారు. ముఖ్యంగా రహదారులు, రైల్వేలు, మెట్రో రైలు, విద్యుత్, ఫుడ్ ప్రొసెసింగ్ రంగాల్లో చేపడుతున్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఎలాంటి జాప్యానికీ ఆస్కారం ఉండకూడదన్నారు. రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి.. వాటి పూర్తికి వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతిని ‘ప్రగతి’ ఎనిమిదో సమావేశంలో ప్రధాని పరిశీలించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిన మోదీ సాధ్యమైనంత త్వరగా నాణ్యతలో ఎలాంటి లోపం లేకుంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫుడ్ పార్క్‌ల ప్రాజెక్టును ప్రత్యేకంగా పరిశీలించిన మోదీ ఇప్పటి వరకూ పూర్తయిన ఈ తరహా ప్రాజెక్టుల వల్ల ఉద్దేశిత ప్రయోజనం చేకూరుతోందా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు నిర్థారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్‌ఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాజెక్టులో భాగంగా అమలు అవుతున్న ప్రత్యక్ష లబ్ధి బదలాయింపుపథకం పురోగతిని కూడా ఈ సందర్భంగా మోదీ సమీక్షించారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించాలన్న పథకం ఎంత వరకూ వచ్చిందని ఆరాతీశారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అమలు అవుతున్న ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించేందుకు ‘ప్రగతి’ సమావేశం ప్రతి బుధవారం జరుగుతుంది.