జాతీయ వార్తలు

నల్లధనంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని, అలాగే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పన్నులు ఎగవేత ద్వారా పేరుకు పోయిన నిధులనూ రూపుమాపవచ్చునని కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ రకమైన అక్రమ నిధుల వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ కొనసాగిందని, ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని తెలిపింది. 500, 1000 నోట్ల రద్దుకు సంబంధించి సమస్త వివరాలతో సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నోట్ల రద్దుకు సంబంధించి చివరి క్షణం వరకూ గోప్యత పాటించామని తెలిపింది. ఇలా చేసి ఉండక పోతే నోట్ల రద్దు వెనుక ఉన్న లక్ష్యమే నీరుగారిపోయి ఉండేదని వివరించింది.
ఈ నిర్ణయం వల్ల స్వల్ప కాలికంగా కొన్ని రంగాలకు నష్టం వాటిల్లినప్పటికీ దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపింది. నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకోవడానికి 24గంటల ముందే కేంద్రం అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. గతంలో ఎన్నడూ ఈ దిశగా ఎలాంటి గట్టి ప్రయత్నం జరుగలేదని, 1946,1978లో ఈ ప్రయత్నం జరిగినా దాని ప్రభావం ఆశించినంతగా లేదని పేర్కొంది. దేశ వ్యాప్తంగా 22కోట్లకు పైగా ఉన్న జన్‌ధన్ ఖాతాల్లోకి అక్రమ నిధులు తరలివస్తున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నట్టు తెలిపింది. నోట్ల రద్దు వల్ల ఈ ఖాతాలను సక్రమంగా నిర్వహించి పేదలకు ఉద్దేశిత మేలు కలిగించే వీలు కలుగుతుందని వెల్లడించింది. అలాగే ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ రేట్లకు కళ్లెం వేయడానికి కూడా పెద్ద నోట్ల రద్దు ఎంతగానో ఉపకరిస్తుందని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది. కృత్రిమంగా పెంచేసిన రియల్ ఎస్టేట్ రేట్ల వల్ల సామాన్యులు, మధ్యతరగతి వాసులకు ఇళ్లు కొనుగోలు చేసే పరిస్థితే లేకుండా పోయిందని తెలిపింది. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ యాప్‌లు, ఈవాలెట్ల చెల్లింపులను విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని, కేవలం పదిరోజుల్లోనే డిజిటల్ చెల్లింపులు 300శాతం పెరిగాయని తెలిపింది.