జాతీయ వార్తలు

నిర్ణయం మీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: తమ అక్రమ సొత్తును న్యాయబద్ధంగా మార్చుకోవడానికి నల్లకుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 30 గడువులోగా నల్లకుబేరులు లెక్కల్లేని తమ సొత్తును స్వచ్ఛందంగా బయట పెడితే 50శాతం పన్నుతో తప్పించుకునే అవకాశం కల్పించింది. అంతే కాదు, ఈ అవకాశాన్ని వినియోగించుకునే వారికి ఆదాయం పన్ను అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే..డిపాజిట్ చేసిన లెక్కల్లేని సొత్తు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ప్రభుత్వం అడగదన్న మాట!కానీ, ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిపై భారీగానే 85శాతం పన్ను, పెనాల్టీలను విధిస్తారు. నల్లకుబేరులకు తమ సొత్తును వెల్లడించే అవకాశాన్ని కల్పిస్తూ అలాగే..లొంగని వారిని కఠినంగా దండించే చర్యల్నీ ప్రతిపాదిస్తూ పన్నుల చట్టం (రెండో సవరణ)బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే వారు 50శాతం పన్ను పోను మిగిలిన 50శాతం మొత్తంలో పాతిక శాతాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా నాలుగేళ్ల పాటు ప్రభుత్వం వద్దే ఉంచాలి. మిగిలిన పాతిక శాతం మొత్తాన్ని మాత్రమే వెంటనే తీసుకునే అవకాశం వీరికి కల్పిస్తారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నానాయాతనలు పడుతున్నారంటూ విపక్షాలు సృష్టించిన గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే కొత్త పథకాన్ని ప్రతిపాదించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకూ వివిధ ఖాతాల్లో జమ అయ్యే నల్లధనాన్ని ఈ పథకం అమలుకు వినియోగిస్తారు. పన్ను, పెనాల్టీ, సర్‌చార్జి మొత్తం కలిపి మొత్తం 50శాతం పన్నును ఈ మొత్తంపై విధిస్తారు. ఈ పథకం కింద నల్లధనాన్ని వెల్లడించే వారిని దాని మూలాల గురించి అడిగే ప్రసక్తే ఉండదని, వారికి సంపద పన్ను, పౌర చట్టాలు సహా ఇతర చట్టాల నుంచీ మినహాయింపు ఉంటుందని రెవిన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఇచ్చిన గడువు పూర్తయిన తర్వాత మాత్రం నల్ల కుబేరులపై 60శాతం పన్ను, దానిపై 25శాతం సర్‌చార్జి (మొత్తం 75శాతం) పన్ను విధిస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ ఆదాయం పన్ను చట్టంలోని 115బిబిఇ సెక్షన్‌ను సవరించాలని ఈ బిల్లు ద్వారా కేంద్రం సంకల్పించింది. అలాగే దీనిపై మరో పదిశాతం పెనాల్టీ విధించేందుకూ వీలు కల్పిస్తూ కొత్త సెక్షన్‌ను ప్రవేశ పెట్టారు. ఇది కూడా కలిపితే.. గడువు తీరిన తర్వాత అధికారుల దాడుల్లో వెల్లడయ్యే నల్లధనంపై విధించే మొత్తం పన్ను 85శాతానికి చేరుకుంటుంది. తాజా బిల్లును మనీ బిల్లుగానే కేంద్రం ప్రవేశ పెట్టింది. అంటే ఎన్‌డిఎ ప్రభుత్వానికి మెజార్టీ ఉన్న లోక్‌సభ దీన్ని ఆమోదిస్తే సరిపోతుంది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజార్టీ లేకపోయినప్పటికీ ఈ బిల్లులో ఎలాంటి సవరణలు ప్రతిపాదించే అవకాశం ఉండదు.