జాతీయ వార్తలు

నరేంద్ర మోదీ గద్దె దిగేదాకా నిద్రపోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దును ఉపసంహరించుకోకపోతే అధికార పీఠంనుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపేందుకు ఆయన నివాసం ఎదుటే నిరసన ప్రదర్శన నిర్వహిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం కోల్‌కతాలో జరిగిన నిరసన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్యాంకులు, ఎటిఎంలలో నగదు లేకపోవడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పెద్దనోట్ల రద్దు వలన ఎదురవుతున్న ఇబ్బందుల వలన ఇప్పటివరకూ 80 మంది ప్రజలు మరణించారని, అయినప్పటికీ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతున్న మోదీ, దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూ డాంబికాలు పలుకుతున్నారని నిప్పులు చెరిగారు.
‘ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేవు. ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి వారు ఎలా బయటపడతారు?’ అని మమత ప్రశ్నించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రకటించడం ద్వారా మోదీ దేశవ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెనీని విధించారని, దీనిపై తుదివరకూ పోరాడుతానని, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకూ విశ్రమించబోనని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరిస్థితిని అధిగమించేందుకు తాను చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, మోదీ నిర్ణయాలను వ్యతిరేకించిన వారి గొంతు నొక్కేందుకు ఆయన సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖ అధికారులను ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ, ఇటువంటి బెదిరింపులకు తాను భయపడబోనని, అవసరమైతే మోదీ ఇంటి ముందే ధర్నాకు దిగుతానని, అధికార పీఠం నుంచి ఆయనను గద్దె దించేవరకూ విశ్రమించబోనని తేల్చిచెప్పారు.
chitram...
పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ సోమవారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో మాట్లాడుతున్న మమతా బెనర్జీ