జాతీయ వార్తలు

కేసులు మూసేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: కేంద్ర ఆర్థిక మంత్రి, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) మాజీ అధ్యక్షుడు అరుణ్ జైట్లీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం కూడా తన దాడిని కొనసాగించింది. ఒక బ్యాంకుకు చెందిన ప్రైవేట్ క్రికెట్ క్లబ్‌కు సంబంధం ఉన్న అంశంలో దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా 2011లో జైట్లీ డిడిసిఎ చైర్మన్ హోదాలో అప్పటి ఢిల్లీ పోలీసు కమిషనర్‌పై ఒత్తిడి చేశారని ఆప్ ఆరోపించింది. డిడిసిఎ ఎలాంటి తప్పు చేయనందున సదరు కేసును మూసివేయాల్సిందిగా కోరుతూ అప్పట్లో జైట్లీ అప్పటి ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.కె.గుప్తా, స్పెషల్ కమిషనర్ రంజిత్ నారాయణ్‌కు రాసిన రెండు లేఖలను ఆప్ బుధవారం ఇక్కడ విడుదల చేసింది. జైట్లీ రాసిన ఈ రెండు లేఖలు తాజాగా బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆప్ మళ్లీ డిమాండ్ చేసింది. గుప్తాకు 2011 అక్టోబర్ 27న, నారాయణ్‌కు 2012 మే 5న జైట్లీ లేఖలు రాశారు. డిడిసిఎలో జరిగిన ఎలాంటి అవకతవకలతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని జైట్లీ తన లేఖల్లో మళ్లీ మళ్లీ పేర్కొన్నారని ఆప్ నాయకుడు అశుతోశ్ పేర్కొన్నారు. అయితే జైట్లీ 1999 నుంచి 2013 వరకు డిడిసిఎకు చైర్మన్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. సిండికేట్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ గుర్తింపునకు సంబంధించి కొంతమంది మళ్లీ మళ్లీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని నారాయణ్‌కు రాసిన లేఖలో జైట్లీ పేర్కొన్నారు. ఫిర్యాదుల్లో వారు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, దీనికి సంబంధించి పోలీసులు విచారిస్తుండటం వల్ల కొంతమంది డిడిసిఎ ఆఫీస్ బేరర్లు వేధింపులకు గురవుతున్నారని జైట్లీ పేర్కొన్నారు. ‘అందువల్ల ఈ అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి డిడిసిఎ ఎలాంటి తప్పు చేయనందున కేసును మూసివేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని జైట్లీ ఆ లేఖలో రాశారు.
ఈ విషయమై డిడిసిఎ వివరణ కోరగా, సిండికేట్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ ప్రస్తుతం ‘ఇన్‌స్టిట్యూషనల్’ కేటగిరీలో ఉందని డిడిసిఎ అధికారి ఒకరు చెప్పారు. ‘ఇన్‌స్టిట్యూషనల్’ కేటగిరీలో ఉన్న క్లబ్‌లకు సబ్సిడీ అందదని, ప్రైవేటు క్లబ్‌లకు సబ్సిడీ అందుతుందని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, జైట్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాయడంలో తప్పేముందని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు ప్రశ్నించారు. అప్పట్లో జైట్లీ అధికారంలో కూడా లేరని, అందువల్ల ఆయనపై చేసిన ఆరోపణ నిలబడేది కాదని అన్నారు.

ఢిల్లీలో బుధవారం డిడిసిఎ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను
విలేఖరులకు చూపుతున్న ఆప్ నేతలు అశుతోష్, సౌరభ్ భరద్వాజ్.