జాతీయ వార్తలు
షీనాబోరా సంతకాన్ని నాతో ఫోర్జరీ చేయించారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, నవంబర్ 27: రిలయన్స్ ముంబై మెట్రోలో పనిచేస్తున్న షీనా బోరా రాజీనామా పత్రంపై తనతో బలవంతంగా ఫోర్జరీ చేయించారని ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ సిబిఐ విచారణలో వెల్లడించింది. షీనా సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు తొలుత తాను అంగీకరించలేదని, కానీ ఒత్తిడి చేయడం వల్ల చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇంద్రాణికి చెందిన ఐఎన్‌ఎక్స్ కంపెనీలో 2002 నుంచి 2007 వరకు కాజల్ శర్మ ఉద్యోగిగా పనిచేశారు. అనంతరం 2011 నుంచి ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. కాజల్‌ను సిబిఐ విచారించడంతో ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 2012 మేలో లండన్‌నుంచి ఇంద్రాణి తనకు ఫోన్ చేశారని, షీనా సంతకాన్ని ప్రాక్టీస్ చేయాలని ఆదేశించారని సిబిఐ అధికారులకు తెలిపింది. షీనా సంతకాన్ని తాను ఎందుకు పెట్టాలని ఇంద్రాణిని ప్రశ్నించానని, దీంతో ఆమె ‘షీనా ప్రస్తుతం అమెరికాలో ఉందని, ఆమెకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదనీ, రాజీనామా పత్రాన్ని వెంటనే పంపాలని రిలయన్స్ మెట్రోనుంచి ఒత్తిడి వస్తోంది’ అని చెప్పారని కాజల్ వెల్లడించింది. నా బాస్ ఆదేశాలు పాటించక తప్పని పరిస్థితి ఎదురవడంతో రాజీనామా పత్రంపై షీనా పేరన సంతకం చేసి రిలయన్స్ మెట్రోకు పంపించానని తెలిపింది. అలాగే, ఇంద్రాణి ఆదేశాల మేరకు 2012 ఆగస్టులో షీనా పేర ఈ-మెయిల్ సృష్టించి రెంట్ అగ్రిమెంట్ రద్దు పత్రాన్ని కూడా పంపించినట్లు పేర్కొంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ ఆమెకు బాగా నమ్మకస్తుడని, ఇంద్రాణి వ్యక్తిగత పనులన్నీ అతనే చూసేవాడని సిబిఐకి తెలిపింది.