జాతీయ వార్తలు

మతం పేరుతో సమాజాన్ని చీలుస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్కాల (కేరళ), డిసెంబర్ 30: మత విద్వేషాలు, అనుమానాలను వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రముఖ సంఘ సంస్కర్త నారాయణ గురు వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి మతతత్వ శక్తులు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం పరోక్షంగా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. నారాయణ గురుకు నివాళులర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15న కేరళలోని వర్కాలలో ఉన్న శివగిరి మఠాన్ని సందర్శించిన కొద్ది రోజులకే సోనియా సైతం ఈ మఠాన్ని సందర్శించి ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అప్పుడు మోదీ పార్లమెంటు సమావేశాల్లో గొడవపై కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ, ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుందని విమర్శించారు.
నారాయణ గురు బోధనలకు మతం రంగు పులమడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఆయనకు వెన్నుపోటు పొడవడమేనని బుధవారం శివగిరి మఠంలో ప్రారంభమైన 83వ వార్షిక ఆరాధనోత్సవాల్లో ప్రసంగిస్తూ సోనియా గాంధీ అన్నారు. అనుమానాలు, మత విద్వేషాలు సృష్టించడం, భిన్న సంస్కృతులు కలిగిన మన సమాజాన్ని చీల్చడం ద్వారా అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు, మతతత్వవాదులు నారాయణ గురు వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంతకన్నా పెద్ద ద్రోహం మరోటి ఉండదని సోనియా అన్నారు. కేరళలో సంఖ్యాపరంగా బలమైన ఎజవా తెగకు చెందిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా సంఘం యోగం కేరళలో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సోనియా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కేరళలో వెనుకబడిన ఎజవా తెగకు అతిపెద్ద యాత్రాస్థలమైన శివగిరి మఠాన్ని నారాయణ గురు సామాజిక సంస్కరణకు, సామాజిక సమానత్వానికి ప్రతీకగా ఏర్పాటు చేసారు. మానవాళి అందరిదీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడనే సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్మడమేకాక ఆ సిద్ధాంతం కోసమే చివరివరకు పోరాడారు. నారాయణ గురు బోధనలయిన సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం అనేవి నేటికి కూడా అవసరమని సోనియా అన్నారు. దురదృష్టం ఏమిటంటే నేటికి కూడా కుల వివక్ష కొనసాగుతోందని, ఈ విషయంలో మనం చేయాల్సింది ఎంతో ఉందని సోనియా అన్నారు. దేశంలో ఏ రూపంలో ఉన్నా వివక్షను పూర్తిగా రూపుమాపడం మనందరి బాధ్యత అని చెప్పారు. నారాయణ గురు ఆధ్యాత్మకత, సంఘ సంస్కరణల మూలకర్త అని, ఆయన దృష్టిలో సంఘ సంస్కరణ అంటే పేదలకు, బలహీనులకు సేవ చేయడం, మానవాళి క్షేమాన్ని కాంక్షించడమేనని సోనియా అన్నారు. ఈ గొప్ప సంస్థ ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఎస్‌ఎన్‌డిపి ప్రయత్నిస్తే, కొంతమంది వ్యక్తులు ఆయన మార్గాన్ని తప్పి ప్రవర్తిస్తే అది నారాయణ గురుకు ద్రోహం చేయడమేనని బిజెపికి దగ్గరవుతున్న ఎస్‌ఎన్‌డిపి ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్ పేరును ప్రస్తావించకుండా సోనియా పరోక్షంగా విమర్శించారు.
నారాయణ గురు సిద్ధాంతాలను పరిరక్షించడం ద్వారా మతం, కులం, తెగ ఆధారంగా సమాజాన్ని చీల్చడానికి జరిగే ప్రయత్నాలను తిప్పికొట్టాలని కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ అన్నారు. ఈ నెల 15న ప్రధాని మోదీ శివగిరి మఠాన్ని సందర్శించినప్పుడు ముఖ్యమంత్రి చాందీకి ఆహ్వానం లేకపోవడం వివాదానికి దారితీన విషయం తెలిసిందే.

చిత్రం.. కేరళలోని శివగిరి మఠంలో బుధవారం వార్షిక ఆరాధనోత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న సోనియా గాంధీ