జాతీయ వార్తలు

తీరప్రాంత జలాలపై మాకే హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: రాష్ట్రాల తీరంలోని ప్రాంతీయ సముద్ర జలాల్లో పన్ను ఎవరు వసూలు చేయాలనే అంశంపై జిఎస్‌టి సమాఖ్య రెండో రోజు సమావేశంలో ప్రతిష్టంభన నెలకొన్నది. ప్రాంతీయ సముద్ర జలాల్లో జరిగే వాణిజ్యంపై పన్ను వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో తీరప్రాంత రాష్ట్రాలు అంగీకరించలేదు. దీనితో జైట్లీ అధ్యక్షతన బుధవారం జరిగిన రెండోరోజు సమావేశంలో ప్రతిష్టంభన నెలకొన్నది. ఫలితంగా ఈ నెల 16న మరోసారి సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రాంతీయ సముద్ర జలాల్లో జరిగే వాణిజ్యంపై వ్యాట్ వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండే విధంగా చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. తీరప్రాంత సముద్ర జలాలపై ఆయా రాష్ట్రాలకే వ్యాట్ అధికారం ఉండాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమ రాష్ట్రం ఎన్నో సంవత్సరాల నుండి ప్రాంతీయ సముద్ర జలాల్లో జరిగే లావాదేవీలపై వ్యాట్ వసూలు చేస్తోందని, దీనికి కేంద్రం గతంలో ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని యనమల వాదించారు. ఈ అధికారాన్ని తొలగిస్తే తమ రాష్ట్రానికి సాలీనా దాదాపు ఆరువందల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి చట్టానికి సవరణ ప్రతిపాదించాలని ఏపి, కర్నాటక తదితర తీర ప్రాంత రాష్ట్రాలు డిమాండ్ చేశాయి.
ప్రాంతీయ జలాల్లో వ్యాట్ వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంచేందుకు జైట్లీ ఇదివరకే అంగీకరించినందున ఇప్పుడు దీనిని మార్చేందుకు ప్రయత్నించకూడదని యనమల స్పష్టం చేశారు. ఎస్‌ఇజడ్ చట్టం ప్రకారం తమ రాష్ట్రంలోని సెజ్‌లలో పన్ను వసూలు చేసే విషయంలో వీటిని విదేశీ ప్రాంతాలుగా పరిగణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ, ఇందుకు ప్రతిగా కేంద్రం ప్రాంతీయ సముద్ర జలాల్లో పన్ను వసూలు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్‌రాష్ట్ర వస్తు సరఫరాపై పన్ను వసూలు చేసే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌జిఎస్‌టి, సిజిఎస్‌టి పన్ను వసూలు చేసి కేంద్ర ప్రభుత్వం ఐజిఎస్‌టి పన్ను వసూలు చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు. వారు ఇబ్బందుల పాలుకాకూడదంటే ఐజిఎస్‌టి పన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసేందుకు అధికారం ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు.