జాతీయ వార్తలు

బాబుపై దాడికి మావోల కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ / విజయవాడ, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందా అంటే ఉందనే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. మావోయిస్టుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై దాడి చేసేందుకు మావోయిస్టులు రాష్ట్రంలో కాకుండా.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఏపి భవన్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆంధ్ర, తెలంగాణ భవన్‌లోకి తెలుగు మీడియాను అనుమతించకూడదని రెండు భవనాల అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టులనుంచి ముప్పు ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి తమకు ఇప్పటికే హెచ్చరికలు అందాయని ఏపి డిజిపి నండూరి సాంబశివరావు సైతం చెబుతున్నారు.
గతంలో అలిపిరి వద్ద మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు ప్రాణపాయం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కొన్ని నెలల క్రితం ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బలిమెల ఘటనకు కౌంటర్‌గా పోలీసులు జరిపినట్లు చెబుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో చాలామంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తమకు తగిలిన ఇంత పెద్ద దెబ్బకు ఉలిక్కిపడిన మావోయిస్టుల నాయకత్వం చంద్రబాబు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే హెచ్చరికలు జారీ చేశారు. పైగా.. 2003 అక్టోబర్‌లో జరిగిన అలిపిరి తరహా ఘటన పునరావృతం అవుతుందన్న ప్రకటనలు కూడా వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర హోంశాఖ మరో 300 మంది సిబ్బందిని ముఖ్యమంత్రి భద్రతా వలయంలో పెంచింది.
కాగా చంద్రబాబు భద్రత అంశం మళ్లీ తెరమీదకు వచ్చిన నేపధ్యంలో డిజిపి నండూరి సాంబశివరావు స్పందించారు. చంద్రబాబుకు హాని తలపెట్టేందుకు ఢిల్లీలోని ఏపి భవన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరుసార్లు మావోలు రెక్కీ నిర్వహించారని, పసిగట్టిన ఢిల్లీ పోలీసులు పలుమార్లు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారని శనివారం విజయవాడలో జరిగిన విలేఖరుల సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు డిజిపి బదులిచ్చారు. నెల రోజుల క్రితమే తమకు సంకేతాలు వచ్చాయని, దీంతో భద్రత పెంచామని, అయినా ముఖ్యమంత్రి భద్రత విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ ఆంధ్రా భవన్‌లో మీడియాపై ఆంక్షలు
మావోయిస్టులు మీడియా ముసుగులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై దాడి చేసే ప్రమాదం ఉన్నందున ఆంధ్ర,తెలంగాణా భవన్‌లోకి తెలుగు మీడియాను అనుమతించకూడదని రెండు భవనాల అధికారులు నిర్ణయించారు. ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రింట్, టీవీ మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించరు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎంపీలు, శాసన సభ్యులెవరైనా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసే పక్షంలో గుర్తింపు కార్డులను పరిశీంచిన తరువాతనే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు,ఇక మీదట ఏపి, తెలంగాణా భవన్‌లోకి తమ వాహనాలను తీసుకురాకూడదని అధికారులు తెలుగు మీడియాకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై దాడి చేసేందుకు మావోయిస్టులు ఏ.పిభవన్‌లో రెక్కీ నిర్వహించటం గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రుల భద్రతకు సంబంధించిన అంశం కేంద్ర హోం శాఖ పరిధిలోనిదనీ, ఆ శాఖ ఇచ్చే ఆదేశాల మేరకు తాము అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.

చిత్రం... విలేఖర్లతో మాట్లాడుతున్న డిజిపి సాంబశివరావు