తెలంగాణ

జాతీయ రగ్బీ పోటీలు తెలంగాణకు గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జనవరి 4: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జాతీయ స్థాయి రగ్బీ పోటీలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని మంచిర్యాల కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. స్థానిక సింగరేణి తిలక్ క్రీడ మైదానంలో 15వ జాతీయ స్థాయి మహిళల, పురుషుల రగ్బీ పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.ఈ పోటీలకు దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరవుతున్నారని, ఇది గొప్ప విజయమని ఆయన అన్నారు. పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ క్రీడాస్ఫూర్తితో ఈ క్రీడలను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్‌కుమార్, జాతీయ టెక్నికల్ కన్వీనర్ సి ఐ డి డీ ఎస్పీ పుల్యాల రవికుమార్, రగ్బీ పుట్‌బాల్ గ్రూప్స్ ఎండి ఎం నాగేశ్వర్ రావు, జాతీయ జనరల్ సెక్రటరీ త్రిశల్ సింగ్, బెల్లంపల్లి ఆర్డీ ఓ వీరన్న, తహసీల్దార్ సురేష్, పి ఈ టీ సభ్యులు శ్రీరాములు, నారాయణ, నాయక్, రాజ్‌మహ్మద్, అనిల్, వెంకటేష్, పాల్గొన్నారు.
అట్టహాసంగా పోటీలు
బెల్లంపల్లి: కోల్‌బెల్ట్ ప్రాంతమైన బెల్లంపల్లిలో మొదటిసారి జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు వేదికైంది. రగ్బీ ఆట తెలియని ఈ ప్రాంతంలో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించి ఈ ప్రాంతాన్ని పలు రాష్ట్రాలకు పరిచయం చేసేందుకు నిర్వాహకులు శ్రమిస్తున్నారు. ఈ పోటీలకోసం సింగరేణి ఫుట్‌బాల్ తిలక్ క్రీడ మైదానం సుందరంగా ముస్తాబైంది. ఈ పోటీలలో పాల్గొనేందుకు తెలంగాణ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, గుజారాత్, విదర్భ, బిహార్ రాష్ట్రాల నుంచి 18 జట్లు పాల్గొననుండగా 500 మంది క్రీడకారులు పోటీలలో ఆడేందుకు రానున్నాట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు బుధవారం తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ జట్లు ట్రయల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. గురువారం నుంచి పూర్తి స్థాయి పోటీలు జరగనున్నాయి.

రగ్బీ పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోటీల ప్రారంభానికి ముందు తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ జట్లు

ముత్తూట్ ఫైనాన్స్
దోపిడీ కేసులో
ఆరుగురు అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 4: రాష్టవ్య్రాప్తంగా కలకలం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసుల ఛేదించారు. అరుగురు దొండగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి నుంచి లాతూర్ వెళ్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సిబిఐ అధికారులమంటూ సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బందిని బెదిరించి రూ. 12 కోట్ల విలువ చేసే బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం సైబరాబాద్ కమిషనర్ దోపిడీకి సంబంధించి వివరాలు వెల్లడించారు. సర్దార్జీగా అనే వ్యక్తి దొంగల ముఠా నాయకుడుగా గుర్తించామని, సర్దార్జీనే సిబిఐ అధికారిగా నటించాడని కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సంగారెడ్డి బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది ఆ సమయంలో వివరాలు ఇచ్చారని, తమను గుర్తుపట్టకుండా సిసి కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేసినట్టు సిపి తెలిపారు. అయితే అదే రోజు వారు వెళ్తున్న వాహనం ఆధారాలు గుర్తించిన పోలీసులు వారి ఊహాచిత్రాలు కూడా విడుదల చేసి గాలింపు చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. 35 సిసి కెమెరాల్లో దుండగుల కదలికలు గుర్తించామని, 16 బృందాలతో గాలించి కర్నాటకలోని గుల్బర్గాలో నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ దోపిడీకి పాల్పడిన ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నట్టు కమిషనర్ సందీప్ శాండిల్య వివరించారు.