జాతీయ వార్తలు

ఆమెకూ బాధ్యత ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 21: పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశారన్న ఆరోపణ ప్రతీ రేప్ కేస్‌కూ వర్తించదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. చదువుకున్న అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ముందు తన అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నప్పుడు దాన్ని రేప్ అనజాలరని బాంబే హైకోర్టు న్యాయమూర్తి మృదులా భట్కర్ తెలిపారు. 21 ఏళ్ల యువకుడు మాజీ గర్ల్‌ఫ్రెండ్ తనపై అత్యాచార అభియోగంపై పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అతనికి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి ‘మోసం చేశారన్న అభియోగానికి ప్రలోభపెట్టడం అన్నది ప్రధానాంశం కావాలి. పెళ్లికి ముందు తాను ఇష్టపూర్తిగా శృంగారంలో పాల్గొన్న సందర్భాల్లో అత్యాచారం చేశారని కానీ, ప్రలోభ పెట్టారని కానీ ఆరోపించటం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. సమాజం మారుతోంది. ఈ రోజు యువత రకరకాలుగా ఒకరినొకరు కలుస్తున్నారు. శృంగార కార్యకలాపాల గురించి వారికి పూర్తి అవగాహన ఉంటోంది. సమాజం స్వేచ్ఛవైపు వెళ్తున్నా, కొన్ని విలువలను ఇంకా పాటిస్తూనే ఉంది. పెళ్లికి ముందు అమ్మాయి కనె్నపిల్లగా ఉండాలన్న నైతికతను ఇంకా మన సమాజం పాటిస్తూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమించి, శృంగారంలో పాల్గొన్న అమ్మాయి, ఆ తరువాత విభేదాలు వచ్చినప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వహించటానికి మాత్రం నిరాకరిస్తోంది’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించుకున్న జంటలు విడిపోయిన తరువాత అమ్మాయి అబ్బాయిపై రేప్ ఆరోపణలు చేయటం ఒక ట్రెండ్‌గా మారిందన్నారు. ఈ రకమైన కేసుల్లో న్యాయస్థానాలు నిందితుడు, బాధితురాలి జీవితం, స్వేచ్ఛల మధ్య సంతులనాన్ని పాటించాలన్నారు. మహిళ చదువుకుని విద్యావంతురాలైనప్పుడు వివాహానికి ముందు శృంగారం, దాని పర్యవసానాలను కచ్చితంగా తెలుసుకుని ఉండాలని న్యాయమూర్తి జస్టిస్ మృదులా భట్కర్ పేర్కొన్నారు. సహజీవనం సాగించిన కొన్నాళ్ల తరువాత అతనిపై అత్యాచారం ఆరోపణలు చేయటం సరికాదని, వివాహానికి ముందు లైంగిక సంబంధం అనేది ఆమె ఇష్టానుసారమే జరిగినప్పుడు అందుకు ఆమే బాధ్యత వహించాలని జస్టిస్ మృదులా భట్కర్ చెప్పారు.