జాతీయ వార్తలు

మార్మోగిన జనగణమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, జనవరి 21: భారత దేశ 68వ గణతంత్ర దినోత్సవానికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రజలు అరుదైన బహుమానాన్ని ఇచ్చారు. మూడున్నర లక్షల మంది ఒకేసారి జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. రోజ్‌కోట్ జిల్లాలోని కాగ్వాద్ గ్రామంలో కొత్తగా నిర్మించిన ఖోదల్ ధామ్ దేవాలయంలో ఖోదియార్ దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ రికార్డును సాధించారు. ‘‘మూడు లక్షల యాభై వేల మందికి పైగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు అధికార ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ రికార్డుకు సంబంధించి మాకు సర్ట్ఫికేట్ కూడా లభించింది.’’ అని ఖోదల్‌ధామ్ ఆలయ ట్రస్ట్ సభ్యుడు హన్స్‌రాజ్ గజేరా తెలిపారు. అంతకుముందు 2014లో బంగ్లాదేశ్‌లో 2,54, 537మంది ఒకేసారి జాతీయ గీతాన్ని ఆలపించిన రికార్డు ఉంది. అంతేకాదు దాదాపు 40కిలోమీటర్లు శోభాయాత్రను నిర్వహించటం, 1008కుండాలతో మహాయజ్ఞాన్ని నిర్వహించి తమ ఆలయ ట్రస్ట్ కొత్త రికార్డుల్ని సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. ఖోదియార్ అమ్మవారు లెయువా పటేల్ సమాజానికి సంబంధించిన దేవత. అయిదు రోజుల ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో సుమారు 50లక్షల మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. సుమారు రూ.60 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఆలోచిస్తున్నట్లు హన్స్‌రాజ్ వివరించారు.