జాతీయ వార్తలు
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలాసోర్ (ఒడిశా), నవంబర్ 27: దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన అగ్ని-1 క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. అణుపదార్థాలను మోసుకెళ్లగలిగే శక్తిగల ఈ క్షిపణికి 700 కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యం ఉంది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సి) శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఒడిశా తీరంలోని టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. అబ్దుల్ కలాం దీవి వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్)కు చెందిన లాంచ్ ప్యాడ్-4 నుంచి ఉదయం 10.02 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్ష విజయవంతం అయిందని ఆ వర్గాలు చెప్పాయి. ప్రయోగించినప్పటి నుంచి నిర్దిష్ట లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే వరకు క్షిపణి పథాన్ని ఆధునిక రాడార్ల బ్యాటరీ, టెలీమెట్రీ అబ్జర్వేషన్ స్టేషన్లు, ఎలక్ట్రో ఆప్టిక్ పరికరాలు, యుద్ధ నౌకలు గమనించాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.