జాతీయ వార్తలు

మీ వ్యాఖ్యలు అవినీతికి ఊతమిస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: ‘ఇతర పార్టీలు డబ్బిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి’ అంటూ గోవాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవినీతిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని, ఇది కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఇసి స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇకపై ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా లేదా ఇసి జారీ చేసే చట్టబద్ధమైన ఆదేశాలను ధిక్కరించినా మీ పైన, మీ పార్టీపైన తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇసి జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈ నెల 8న గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ కాంగ్రెస్, బిజెపి పార్టీలు డబ్బిస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం ఆప్‌కే వేయాలని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇసికి ఫిర్యాదు చేసింది. ఈ నెల 16న ఇసి కేజ్రీవాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ, 19వ తేదీ మధ్యాహ్నం లోపల తన ముందు హాజరయి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే కేజ్రీవాల్ ఈ ఆదేశాలను ఖాతరు చేయలేదు. తాను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదంటూ ట్విట్టర్‌ద్వారా మాత్రమే స్పందించారు. కాగా, ఇసి తాజా ఆదేశాలపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ, తనకు వ్యతిరేకంగా ఇసి ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా తప్పుడు ఆదేశాలని అన్నారు. కింది కోర్టు తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే ఇసి దాన్ని పట్టించుకోలేదని, ఇసి ఆదేశాలను కోర్టులో సవాలు చేస్తానని స్పష్టం చేశారు.