జాతీయ వార్తలు

బిఎస్‌పిలోకి ములాయం అనుచరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 21: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితమైన అనుచరుడిగా పేరు పొందిన అంబికా చౌదరి శనివారం బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)లో చేరారు. ములాయం సింగ్ పట్ల ఆయన కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ వ్యవహరిస్తున్న తీరు తీవ్రమైన విచారాన్ని కలిగించిందని అంబికా చౌదరి పేర్కొన్నారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న అంబికా చౌదరికి బలియాలో ఆయన ఎప్పటినుంచో పోటీ చేస్తున్న పెపానా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ కేటాయిస్తానని మాయావతి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన అంబికా చౌదరి ఆ తర్వాత రాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. బిఎస్‌పిలో అంబికా చౌదరి చేరికను సాదరంగా స్వాగతిస్తున్నామని, సమాజ్‌వాదీ పార్టీలో పొందిన గౌరవం కంటే బిఎస్‌పిలో ఆయనకు అన్ని స్థాయిల్లో ఎంతో గౌరవం ఇస్తామని, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బలియాలోని పెపానా సెగ్మెంట్ నుంచి టికెట్ కేటాయిస్తామని మాయావతి స్పష్టం చేశారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీపై ఆధిపత్యంకోసం ములాయం కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న కుమ్ములాటలు, ప్రత్యేకించి ఎన్నికల సమయంలో జరుగుతున్న కుమ్ములాటలు ఆ పార్టీ సొంత వ్యవహారమేమీ కాదని, ప్రస్తుతం ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర విచారాన్ని కలిగించడంతో పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసి బిఎస్‌పిలో చేరుతున్నానని అంబికా చౌదరి తెలిపారు.
chitra
శనివారం మాయావతి సమక్షంలో బిఎస్‌పిలో చేరిన ఎస్పీ నేత అంబికా చౌదరి