జాతీయ వార్తలు

పద్మ అవార్డు గ్రహీతలు వీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మ విభూషణ్
ఎన్సీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్, మాజీ మంత్రి మురళీమనోహర్ జోషి, మాజీ సిఎం దివంగత సుందర్‌లాల్ పట్వా, లోక్‌సభ మాజీ ఎంపీ దివంగత పిఏ సంగ్మా, గాయకుడు కెజె యేసుదాస్, ప్రొఫెసర్ ఉడిపి రామచందర్‌రావు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్.

పద్మభూషణ్ గ్రహీతలు
విశ్వమోహన్ భట్ (సంగీతం, రాజస్తాన్), ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేదీ (సాహిత్యం, యూపీ) డెహంతాన్ ఉదవాడియా (వైద్యం, మహారాష్ట్ర), రత్నసుందర్ మహారాజ్ (ఆధ్యాత్మిక గురువు, గుజరాత్), స్వామి నిరంజన్ నందా సరస్వతి (యోగా, బిహార్ ), హెచ్‌ఆర్‌హెచ్ రాకుమారి మహాచక్రి సిరిందోర్న్ (సాహిత్యం, థాయిలాండ్),స్వర్గీయ చోరామస్వామి (సాహిత్యం, తమిళనాడు)లకు పద్మభూషణ్ అవార్డులు వరించాయి.

పద్మశ్రీలు
సంగీత రంగంనుంచి పద్మశ్రీ అందుకుంటున్న వాళ్లలో బసంతి బిష్ట్ (ఉత్తరాఖండ్ ), టికె మూర్తి (తమిళనాడు), లైష్‌రాం బీరేంద్రకుమార్ సింగ్ (మణిపూర్), కృష్ణరాం చౌదరి (ఉత్తరప్రదేశ్) జితేంద్ర హరిపాల్ (ఒడిశా), కైలాష్ ఖేర్, అనురాథా పోడ్వల్ (మహారాష్ట్ర), పరస్సల బి పొన్నమ్మళ్ (కేరళ), సుక్రి బొమ్మగౌడ (కర్నాటక), ముకుంద్ నాయక్ (జార్ఖండ్), పురుషోత్తం ఉపాధ్యాయ్ (గుజరాత్), ఇమ్రత్ ఖాన్ (ఎన్‌ఆర్‌ఐ, యుఎస్‌ఏ)లు ఉన్నారు. నృత్య రంగంనుంచి చెమంచెరి కున్హిరామన్ నాయర్ (కేరళ), అరుణా మొహంతీ (ఒడిశా)లు ఉన్నారు. సినిమా రంగం నుంచి భారతి విష్ణువర్ధన్ (కర్నాటక), సాధు మెహెర్ (ఒడిశా), చిత్రలేఖన రంగంలో బోవా దేవి (బిహార్ ), తిలక్ గితాయ్ (రాజస్తాన్), శిల్పకళలో ఎక్కా యాదగిరి రావు (తెలంగాణ), నాటక రంగం నుంచి వారెప్ప నబా నిల్ (మణిపూర్), సివిల్ సర్వీసెస్ నుంచి టికె విశ్వనాథన్ (హర్యానా), కన్వల్ సిబల్ (్ఢల్లీ)లను పద్మశ్రీ వరించింది. విద్య, సాహిత్య రంగం నుంచి బిర్కా బహుదూర్ లింబూ మురింగ్ల (సిక్కిం), ఎలి అహ్మద్ (అసోం), డాక్టర్ నరేంద్ర కోహ్లి (్ఢల్లీ), ఫొఫెసర్ జి వెంకటసుబ్బయ్య (కర్నాటక), అక్కితం ఆచ్యుథన్ నంబూద్రి (కేరళ), కాశీనాథ్ పండిత (జమ్మూకాశ్మీర్), చాము కృష్ణ శాస్ర్తీ (్ఢల్లీ), హరిహర్ క్రిపాలు త్రిపాఠి (ఉత్తరప్రదేశ్), మైఖేల్ డనినో (తమిళనాడు), పూనం సూరి (్ఢల్లీ), విజి పాటిల్ (గుజరాత్), వి కోటేశ్వర రావు (ఆంధ్రప్రదేశ్), అనంత్ అగర్వాల్ (ఎన్‌ఆర్‌ఐ/పిఐవో)లను పద్మశ్రీ వరించింది. సాహిత్యం, జర్నలిజం విభాగం నుంచి బల్బీర్ దత్ (జార్కండ్), భావనా సోమయ్య (మహారాష్ట్ర), విష్ణు పాండ్యా (గుజరాత్), హెచ్‌ఆర్ షా (అమెరికా)లు ఉన్నారు. వైద్య రంగం నుంచి సుబ్రుతో దాస్ (గుజరాత్), డాక్టర్ భక్తి యాదవ్ (మధ్యప్రదేశ్), డాక్టర్ మదన్‌మాధవ్ గోడ్బోలే (ఉత్తరప్రదేశ్), దేవేందర్ దయాభాయి పటేల్ (గుజరాత్), ప్రొఫెసర్ హరికిషన్‌సింగ్, ముకుట్ మింజ్ (చండీగఢ్), స్వర్గీయ సునీత సొలోమన్ (తమిళనాడు)లకు పద్మశ్రీ దక్కింది. పురావస్తు శాఖ విభాగం నుంచి అరుణ్‌కుమార్ శర్మ (చత్తీస్‌గఢ్), స్వర్గీయ అశోక్‌కుమార్ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్), వంటల విభాగం నుంచి సంజీవ్ కపూర్ (మహారాష్ట్ర), మార్షల్ ఆర్ట్స్ విభాగంలో మీనాక్షి అమ్మ (కేరళ), వ్యవసాయ రంగం నుంచి జెనాభాయి దుర్గ్భాయ్ పటేల్ (గుజరాత్)లకు పద్మశ్రీలు దక్కాయి. సైన్స్, ఇంజనీరింగ్ విభాగం నుంచి అజయ్‌కుమార్ రే (పశ్చిమ బెంగాల్), జితేంద్రనాథ్ గోస్వామి (అసోం), స్వర్గీయ డాక్టర్ మపుస్కర్ (మహారాష్ట్ర), అనురాధా కోయిరాలా (నేపాల్) లకు పద్మశ్రీ దక్కాయి. సామాజిక సేవా విభాగం నుంచి దారేపల్లి రామయ్య (తెలంగాణ), గిరీష్ భరద్వాజ్ (కర్నాటక), కరీముల్ హక్ (పశ్చిమ బెంగాల్), బిపిన్ గణత్రా (పశ్చిమ బెంగాల్), నివేదితా రఘునాథ్ బిడే (తమిళనాడు), అప్పా సాహెబ్ ధర్మాధికారి (మహారాష్ట్ర), బాబా బల్బీర్‌సింగ్ సేచేవాల్ (పంజాబ్)లకు పద్మశ్రీ ప్రకటించారు. క్రీడారంగం నుంచి విరాట్ కోహ్లి (్ఢల్లీ), శేఖర్ నాయక్ (కర్నాటక), వికాస్ గౌడ (కర్నాటక), దీపా మాలిక్ (హర్యానా), మరియప్పన్ తంగవేలు (తమిళనాడు), దీపా కర్మాకర్ (త్రిపుర), పిఆర్ శ్రీజేష్ (కేరళ), సాక్షి మాలిక్ (హర్యానా)లకు ప్రకటించారు.