జాతీయ వార్తలు

వృద్ధికి ఊతం.. సంక్షేమానికి పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలోని ప్రతి సెక్టార్ ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చేవిధంగా కొత్త బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ విశే్లషించారు. భవిష్యత్ దృక్పధంతో కూడిన ఈ బడ్జెట్ పేదలు, రైతులతోపాటు ప్రతి ఒక్కరికీ మేలుచేసేదేనని అదే విధంగా ఉద్యోగ కల్పనతో పాటు అన్ని రంగాల్లోనూ పారదర్శకతను పెంపొందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల పునరుజ్జీవనం, గ్రామీణ అభివృద్ధికి పెద్ద పీట వేయడం జరిగిందని ప్రధాని స్పష్టం చేశారు. గత రెండున్న సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎలాంటి ప్రయోజనాలను ఇచ్చాయన్నది స్పష్టం చేయడంతోపాటు భవిష్యత్ అవసరాల సాధనకు ఈ బడ్జెట్ వారధి అని మోదీ పేర్కొన్నారు. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలన్న తమ లక్ష్యానికి 2017-18 బడ్జెట్ మరింత ఊతాన్ని ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పారు. ఏ ఒక్కరిని విస్మరించకుండా ఏ ఒక్క రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి ప్రాధాన్యతలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఏ విధంగా చూసిన ఇది దేశ హితానికి దోహదం చేసే మంచి బడ్జెట్ అని పేర్కొన్న మోదీ దీని వల్ల అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందని కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతుల ఆదాయం రెండింతలు అవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంగా గ్రామాల ఆర్థిక స్థితిగతులను గుణాత్మక రీతిలో ఈ బడ్జెట్ ద్వారా మెరుగుపరిచే అవకాశం ఉంటుందని అన్నారు. విత్తలోటును పెంచకుండా మధ్యతరగతి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం జరిగిందని మోదీ చెప్పారు. రైతులు, వ్యవసాయ రంగం,గ్రామాలు, దళితులు, అణగారిన వర్గాల బాగే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. రైల్వేల ఆధునీకరణ మొదలుకొని ఆర్థిక సంస్కరణల వరకూ అలాగే విద్య నుంచి ఆరోగ్యం వరకూ కొత్త పరిశ్రమలకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలను అందించే దిశగా ఈ బడ్జెట్ ఓ సమగ్ర రీతిలో రూపుదిద్దుకుందని అన్నారు. మహిళ సంక్షేమంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి కేటాయింపులు గణనీయంగా పెంచామని ప్రధాని వెల్లడించారు. అవినీతి, నల్లధన నిర్మూలన లక్ష్యానికి జైట్లీ బడ్జెట్ అద్దం పట్టిందని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పట్టం గట్టిందని స్పష్టం చేశారు. అల్పాదాయ వర్గాలకు పన్నులు పరంగా వెసులుబాటు కల్పించడం సాహసోపేతమైన చర్య అని దీని వల్ల మధ్యతరగతి వాసులకు ఎంతో ప్రయోజనం అన్నారు. సాధారణ, రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం వల్ల వృద్ధికి ఊతం వస్తుందన్నారు. గృహనిర్మాణ రంగానికి ప్రయోజనం కలిగించామని మోదీ చెప్పారు.