జాతీయ వార్తలు

లబ్ధిదారుల ఖాతాల్లోకే కిరోసిన్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: వంటగ్యాస్ వినియోగదారులకు సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే పద్ధతిని విజయవంతంగా అమలు చేసిన కేంద్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అదే పద్ధతిని కిరోసిన్ వినియోగదారులకు అమలు చేయనుంది. అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కిరోసిన్ వినియోగదారులు కూడా మార్కెట్ ధరపై కిరోసిన్‌ను కొనాల్సి ఉంటుంది. వారు పొందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)లో లీటర్ కిరోసిన్ ధర రూ. 12 ఉంది. మార్కెట్ ధర రూ. 43 ఉంది. అంటే వినియోగదారులు లీటర్‌కు రూ. 43 చొప్పున చెల్లించి కిరోసిన్ కొనుగోలు చేయాలి. పిడిఎస్ ధరకన్నా ఎక్కువ చెల్లించిన రూ. 31ని ప్రభుత్వం తరువాత సదరు వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా కిరోసిన్‌పై చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తం తగ్గుతుందని ప్రభుత్వ భావిస్తోంది. ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరంలో కిరోసిన్‌పై రూ. 24,799 సబ్సిడీగా చెల్లించింది. ‘కిరోసిన్ విషయంలో నేరుగా సబ్సిడీని బదిలీ చేయడం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్- డిబిటి) పద్ధతిని ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు చేయడానికి అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చాయి’ అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. కిరోసిన్‌పై డిబిఎస్ పద్ధతి ఏప్రిల్ ఒకటి నుంచి చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్‌పూర్, హర్యానాలోని పానిపట్, పంచ్‌కుల, హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, సోలన్, ఉనా, జార్ఖండ్‌లోని ఛాత్రా, గిరిదిహ్, తూర్పు సింగ్‌భుమ్, హజారిబాగ్, జంతారా, ఖుంటిలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్‌లోని ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు చేయనున్నట్లు వివరించింది. అర్హులయిన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారు మొదటిసారి కిరోసిన్ కొనుగోలు చేయడానికి ముందే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం వివరించింది.