జాతీయ వార్తలు

నిర్మాణంలోనే కుప్పకూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, ఫిబ్రవరి 1: నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలి ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో పనె్నండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాన్పూర్‌లోని కాన్పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సహాయ చర్యల నిమిత్తం సైన్యం రంగంలోకి దిగింది. శిథిలాల తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ ఏడంతస్తుల భవనంలో ముందుగా పై అంతస్తుల కూలడం ప్రారంభమైందని, ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతిచెందారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని డిఐజి రాజేష్ మొదక్ వెల్లడించారు. శిథిలాలు తొలగిస్తే తప్ప మృతుల సంఖ్యపై స్పష్టత రాదని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా, నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు దుర్మరణం చెందిన వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, సహాయ చర్యల నిమిత్తం రెండు బృందాలను తరలించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలుపుతూ మరో ట్వీట్ చేశారు. కుప్పకూలిన భవనం సమాజ్‌వాది పార్టీ నాయకుడు మహ్‌తాబ్ ఆలమ్‌దని స్థానికులు వెల్లడించగా, అధికారులు మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు.