జాతీయ వార్తలు

సెన్సార్ బోర్డు ప్రక్షాళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: జాతీయ ఫిల్మ్ సెన్సార్ బోర్డు(సిబిఎఫ్‌సి) ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. బోర్డు పనితీరుపై ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్‌బెనెగల్ సారధ్యంలో ఓ ప్యానెల్ కమిటీ ఏర్పాటైంది. అలాగే సినీ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, పియూష్ నంది, సినీ విమర్శకుడు భవనా సోమాయలను కమిటీ సభ్యులుగా నియమించారు. బెనెగల్ కమిటీ అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక అందజేస్తుంది. నేషనల్ ఫిల్మ్‌డెవలెప్‌మెంట్ కమిటీ ఎంపి నీనా లత గుప్తా, సంయుక్త కార్యదర్శి(్ఫల్మ్స్) సంజయ్ మూర్తిలను కమిటీలో ఉంటారని కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సినిమాలకు సర్ట్ఫికెట్ల జారీలో, అలాగే పనితీరులో జవాబుదారీతనం పెంపొందించడానికి తీసుకోవల్సిన చర్యలపై కమిటీ దృష్టి సారిస్తుంది. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక ఇస్తుంది.