జాతీయ వార్తలు

నీటి సద్వినియోగంతో పేదరికం దూరం: గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశవ్యాప్తంగా సముద్రంలోకి 70 శాతం నీరు వృధాగా పోతుందని, వాటిలో 20 శాతం నీటిని వినియోగించుకోగలిగితే దేశంలో పేదరికం ఉండదని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తు పెంపు సమస్యను మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు, రాజస్థాన్ నదీ జలాల అథారిటీ ఛైర్మన్ శ్రీరాం వెదిరె రచించిన ‘గోదావరి జలాల సంపూర్ణ వినియోగం-తెలంగాణ, జాతీయ దృక్పథం’ అన్న ఆంగ్ల పుస్తకాన్ని బుధవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ఉమా భారతి, బండారు దత్తాత్రేయ ఢిల్లీలో అవిష్కరించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ నదులపై బ్యారేజీ-గేట్‌వేలు నిర్మించడంద్యారా జల రవాణకు అనుకులంగా ఉంటుందన్నారు. మొదటగా ఆగ్రావద్ద యమునా నదిపై ఒకటి, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలలో ఒకటి నిర్మించాలని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తు పెంపును పొరుగు రాష్ట్రాల నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సమస్యలు సమసిపోతాయని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం వెదిరె శ్రీరాం మాట్లాడుతూ రెండు రోజుల్లో తెలుగు అనువాద పుస్తకాన్ని హైదరాబాద్‌లో అవిష్కరిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తు పెంచడం వల్ల 350 టీఎంసీల నీటిని నిల్వచేయడం ద్యారా సాగర్‌కు 100 టీఎంసీలు ఇవ్వొచ్చని వెల్లడించారు.
నిధులను దారి మళ్లిస్తున్న తెలంగాణ
కేంద్ర మంత్రులకు టిడిపి నేతల ఫిర్యాదు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల నిధులను తెలంగాణ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కేంద్ర మంత్రులకు తెలంగాణ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అధ్వర్యంలో బుధవారం కేంద్ర మంత్రులను కలిశారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కలిసి ఖాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాధామెహన్ సింగ్‌లను కలిశారు. కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలసి గత సవత్సరం కేంద్రం విడుదల చేసిన రూ.800 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం రైతలకు ఇవ్వకుండా కాంట్రాకర్లకు అందజేసిందని వివరించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో రెవంత్ రెడ్డి, రమేష్ రాథోడ్, గరికపాటి మోహన్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.