జాతీయ వార్తలు

పటిష్ఠ భారత్‌కు పునాది వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తెలంగాణ, హర్యానా ప్రభుత్వాలు సాంస్కృతిక ఒప్పందం చేసుకోవటం ద్వారా ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’కోసం కృషి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. బుధవారం రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ప్రధాని ఈ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ, హర్యానా ప్రభుత్వాలు తమ రాష్ట్రాల భాష, సభ్యత, సంస్కృతిని ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ ఏర్పాటుకు కృషి చేస్తున్నాయన్నారు. హర్యానావాసులకు తెలంగాణ భాష, తెలంగాణ వాసులు హర్యానా భాష నేర్చుకోవటం, ఒక రాష్ట్రం సభ్యత, ఆచారాలు, వ్యవహారాలను తెలుసుకోవటం వలన రెండు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహం ఏర్పడటంతోపాటు పటిష్ట భారత్‌కు పునాది పడుతుందని మోదీ చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి ఒప్పందాలు చేసుకోవాలని ఆయన సూచించారు.