జాతీయ వార్తలు

త్వరలో రాహుల్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ గాంధీ త్వరలోనే చేపట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ఊతం లభిస్తుంది. రాహుల్ 8వ తేదీ తర్వాత ఎప్పుడైనా స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఆయన వచ్చిన తర్వాతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టకూడదని రాహుల్ భావిస్తున్నట్టుగా వస్తున్న కథనాల్లో కూడా ఎలాంటి నిజం లేదని ఈ వర్గాలు వెల్లడించాయి. ఎంత త్వరగా కాంగ్రెస్ సారథ్యాన్ని రాహుల్ గాంధీ చేపడితే అంత మంచిదన్న అభిప్రాయాన్ని పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యక్తం చేశారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పగ్గాలను ఎప్పుడు చేపడతారన్న ప్రశ్నకు ‘ఆయనే్న అడగండి’అని ఇటీవల ఓ విలేఖరి ప్రశ్నకు సోనియా జవాబిచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత లభించింది.