జాతీయ వార్తలు

నేను మీ నుంచే వచ్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం నాకుంది

దేశ సమస్యలు తీర్చగలను నోట్ల రద్దుతో అవినీతిపరులు ఏకమయ్యారు
అఖిలేశ్, రాహుల్‌ది వారసత్వ బలమే ధైర్యంగా ముందుకెళ్లలేరు
ఇక కాంగ్రెస్ గురించి పురాతత్వ రికార్డులు పరిశీలించాల్సిందే
వారణాసి సభలో ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు

వారణాసి, మార్చి 5: దేశ ప్రజల సమస్యలు తీర్చడానికి తాను ఎలాంటి కఠిన నిర్ణయాన్నైనా తీసుకోగలనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తనది వారసత్వ బలం కాదని పేర్కొన్న ఆయన ‘నేను మీనుంచే వచ్చా, మీ సమస్యలు తీర్చే ధైర్యం, చొరవ నాకున్నాయి’ అని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతో అవినీతిపరులంతా ఏకమయ్యారని ఆదివారం నాడిక్కడ జరిగిన భారీ రోడ్ షోలో మోదీ అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ బలహీనమైన వ్యక్తులని, వారసత్వ బలంతో రావడంవల్ల ఎలాంటి కఠిన నిర్ణయాలు వారు తీసుకోలేరని మోదీ అన్నారు. జనం నుంచి వచ్చిన తనకు ఉత్తరప్రదేశ్ అవసరాలు తీర్చే కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యముందని అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన భారీ ర్యాలీలో మోదీ మాట్లాడారు. సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పీలు ఒకే నాణేనికి ఉండే రెండు పార్శ్వాల వంటివని అన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని పేర్కొన్న మోదీ, ‘అసలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేదా అని తెలుసుకోవడానికి పురావస్తు రికార్డులను పరిశీలించాల్సిన రోజూ రావచ్చు’ అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతోందని ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దు యావద్భారత ప్రజలు బలపరిస్తే, కాంగ్రెస్ పార్టీ, బిఎస్‌పీ, సమాజ్‌వాది పార్టీలు దాన్ని వ్యతిరేకించాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే యుపీని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశానికి ఇంతకాలం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు దోచుకుతిన్నారని మోదీ ధ్వజమెత్తారు. సంక్షేమ కార్యక్రమాలను చేపట్డంలో యుపీ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం కొందరికే అభివృద్ధి ఫలాలు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కొందరికి కళ్లల్లో శుక్లాలున్నట్లుగా కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలకు ఓట్ల శుక్లాలున్నాయని వ్యాఖ్యానించిన మోదీ కేవలం ఓట్ల సందర్భం వస్తే తప్ప ఈ రెండు పార్టీలకు ఏదీ కనిపించదు అని అన్నారు. యుపి అభివృద్దికి కేంద్రం ఎన్నో పథకాలను చేపట్టినా వాటి అమలును అఖిలేశ్ ప్రభుత్వం అడ్డుకుందని అన్నారు. ముఖ్యంగా వారణాసి విషయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలిపారు.

చిత్రం... ఆదివారం వారణాసిలో జరిగిన రోడ్ షోలో మోదీ అభివాదం