అంతర్జాతీయం

పఠాన్‌కోట్ దాడిని ఖండించిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 3: పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి జరపడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసేందుకు కలసికట్టుగా కృషి చేయాలని భారత్‌తో పాటు చుట్టుపక్కల గల అన్ని దేశాలకు అమెరికా ఆదివారం విజ్ఞప్తి చేసింది. ‘పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.
ఉగ్రవాదంపై పోరాడటంలో భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని, తీవ్రవాదులను తుదముట్టించి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసేందుకు ఈ ప్రాంతంలోని దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయాల్సిందిగా అమెరికా విజ్ఞప్తి చేస్తోందని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.