జాతీయ వార్తలు
కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని సంస్కరణలు: దత్తాత్రేయ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: కార్మికుల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రారంభించి కార్మిక శాఖ మంత్రిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడలలోనే తమ శాఖ పని చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బం డారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. అంబేద్కర్ నేతృత్వం వహించిన కార్మిక శాఖను తనకు అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ అశయాలను సాధించే దిశలో అనేక కొత్త పధకాలను చేపట్టినట్లు ఆయన శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక శాఖలో అమలు చేసిన సంస్కరణలను వివరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కార్మిక సంక్షేమానికి సంబంధించి మరి కొన్ని బిల్లులను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి చెప్పారు.