జాతీయ వార్తలు

కేజ్రివాల్‌కు మరో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ) వివాదంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డిడిసిఏలో అవినీతిపై ఢిల్లీ ప్రభుత్వం నియమించిన దర్యాప్తుకు చట్టబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించగా, తాజాగా ఈ వివాదంలో కేజ్రివాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో అయిదుగురిపై అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో విచారణ జరపడానికి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ నిర్ణయించారు. దీనికి సంబంధించి నిందితులకు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అంతకుముందు జైట్లీ కోర్టుకు రాకపోవడంపైన, విచారణను వాయిదా వేయాలా అనే దానిపైన కోర్టు హాలులోనే అడ్వకేట్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. చంపేస్తామంటూ తమకు బెదిరింపులు వస్తున్నాయని కోర్టుకు హాజరయిన కేజ్రివాల్, ఇతర ఆప్ నేతలు ఫిర్యాదు చేయడంతో భద్రతా సిబ్బందిని పిలిపించిన మేజిస్ట్రేట్ కేసుతో సంబంధం ఉన్నవారు తప్ప మిగతా వారినందరినీ బైటికి పంపించేయాల్సిందిగా ఆదేశించారు. అనంతరం కోర్టు కేసు తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది.
అరుణ్ జైట్లీ డిడిసిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారీఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ కేజ్రివాల్‌సహా కొందరు ఆప్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు ఢిల్లీ ఆప్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని సైతం నియమించింది. అయితే ఈ దర్యాప్తుకు చట్టబద్ధత లేదని కేంద్రం గతంలో ప్రకటించింది. కేజ్రివాల్‌తో పాటుగా ఆప్ నేతలు అశుతోష్, కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపాయ్ తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని జైట్లీ ఆరోపిస్తూ వారిపై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయడం తెలిసిందే.