బిజినెస్

దోచుకున్నదంతా ఇచ్చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: పేద, మధ్యతరగతివారిని దోచుకున్న వాళ్లు అదంతా తిరిగి ఇచ్చేయాల్సిందే’నని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా విజయ్ మాల్యానుద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారన్న వార్త తెలిసిన కొద్ది గంటలకే మోదీ ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘నిజమే. దేశంలో అవినీతికి స్థానం లేదు. పేద, మధ్యతరగతివారిని దోచుకున్నవారు అదంతా తిరిగి ఇచ్చేయాల్సిందే’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘అవినీతి.. కష్టపడి సంపాదించుకున్న సొమ్మునేకాదు, పరువును కూడా దోచుకుంటోంది’ అని తన ట్విట్టర్ ఖాతా అభిమాని ఒకరు చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ప్రధాని స్పందించారు. రుణాల ఎగవేత కేసులో మాల్యాను తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థనపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. అయితే అరెస్టయిన కొద్ది గంటలకే స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
కాగా, ‘్భరతీయ రైతులు దేశానికే గర్వకారణం. వారి శ్రమ కోట్లాది మందికి అన్నం పెడుతోంది. వారి సంక్షేమం కోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మరో ట్వీట్‌కు సమాధానంగా మోదీ అన్నారు.

చిన్నతరహా చెక్కు పేమెంట్లపై చార్జీలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: చెక్కు ద్వారా స్వల్ప చెల్లింపులపై ఎస్‌బిఐ కార్డ్.. 100 రూపాయల చార్జీని ప్రారంభించింది. 2,000 రూపాయల లోపున్న పేమెంట్స్‌కు ఈ చార్జీ వర్తిస్తుందని తెలిపింది. ఎస్‌బిఐ కార్డ్ కస్టమర్లు 40 లక్షల పైమాటే. తాజా నిర్ణయంతో వీరుచేసే స్వల్ప మొత్తాల చెల్లింపులపై చార్జీల భారం పడనుంది. ఈ నెల 1 నుంచే చార్జీలు వర్తిస్తాయని మంగళవారం ఎస్‌బిఐ కార్డ్ స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన డిజిటల్ లావాదేవీలకు ఊతమివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అనుబంధ విభాగమైన ఎస్‌బిఐ కార్డ్ తెలిపింది.

నేడు అమెరికాకు
అరుణ్ జైట్లీ బృందం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. బుధవారం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అమెరికా, రష్యా దేశాల్లో పర్యటించనున్న ఆయనతోపాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా ఉంటారు. తొలుత అమెరికాలో జరిగే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సమావేశాల్లో పాల్గొననున్నారు. అలాగే 21న జరిగే జి-20 సమావేశానికీ జైట్లీ, పటేల్ హాజరవుతారు. తర్వాత అంతర్జాతీయ ద్రవ్య ఆర్థిక కమిటీ (ఐఎమ్‌ఎఫ్‌సి) ప్రారంభ సమావేశంలోనూ జైట్లీ, పటేల్, దాస్ పాల్గొంటారు. అనంతరం సిఇఒలతో జైట్లీ సమావేశం అవుతారు. 22న ఐఎమ్‌ఎఫ్‌సి ప్లీనరీ సెషన్‌కూ జైట్లీ, పటేల్, దాస్ హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ చేపట్టే డెవలప్‌మెంట్ కమిటీ ప్లీనరీ సమావేశంలో పాల్గొననున్న జైట్లీ.. అమెరికా ఆర్థిక మంత్రితోకూడా భేటీ కానున్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలుసుకుంటారు. 23న జైట్లీ, దాస్ న్యూయార్క్‌కు వెళ్లనుండగా, సాయంత్రం అక్కడ భారతీయ పరిశ్రమ విభాగం ఇచ్చే విందులో పాల్గొంటారు. 24న సంస్థాగత, దీర్ఘకాలిక మదుపరులతో సమావేశం, విదేశీ సంబంధాల మండలితో సమావేశం అవుతారు. సాయంత్రం జైట్లీ రష్యా రాజధాని మాస్కోకు పయనమవుతారు.

‘నేపాల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి’
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ‘మా దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి’ అంటూ భారత పర్యటనకు విచ్చేసిన నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఇక్కడి వ్యాపార, పారిశ్రామిక వర్గాలను కోరారు. మంగళవారం భారతీయ వ్యాపార, పారిశ్రామిక సంఘాలైన సిఐఐ, ఫిక్కీ, అసోచామ్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. నేపాల్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, సరళతరమైన పన్నుల విధానం అమల్లో ఉందని చెప్పుకొచ్చారు.